శ్రీహరి మేనును నీలాకాశంతో పోలుస్తాం. మబ్బులు పట్టిన ఆకాశం నల్లగా ఉంటుంది. ఎండా వానా కలిసి వచ్చినప్పుడు ఆకాశం సప్త వర్ణాలతో సుందరశోభితంగా విరాజిల్లుతుంది. సాయం సంధ్యలో ఆకాశం ఎర్రగా కనిపించడం సాధారణమే. ఆయితే ఆకుపచ్చని వాతావరణాన్ని ఏ కవీ ఊహించలేదు. ఏ వాతావరణ శాస్త్రవేత్తా ఇప్పటి వరకూ కనుగొన్నదీ లేదు. అలాంటిది అమెరికాలో ఆకాశం ఆకుపచ్చ వర్ణం సంతరించుకుంది. అది అందంగా ఉందా? లేదా అన్నది పక్కన పెడితే ఆకాశం ఆకుపచ్చ రంగు సంతరించుకోవడాన్ని చూసి జనం భయాందోళనలకు గురయ్యారు.
వాతావరణ శాస్త్రవేత్తలూ ఇలా ఎందుకు జరిగిందా అన్న పరిశోధనల్లో మునిగి పోయారు. అమెరికాలో ఎన్నడూ లేని విధంగా ఆకాశం ఆకుపచ్చ రంగు పులుముకుంది. అమెరికాలోని సౌత్ డకోటా, సియోక్స్ ఫాల్స్ ప్రాంతాల్లో భారీ తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ తగ్గిన అనంతరం ఆకాశమంతా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.
అధికారులు సైతం ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారడం ఇప్పటి వరకూ చూడలేదన్నారు. వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం ఎర్రటి సూర్య కిరణాలు సాయంత్రం వేళలో తుఫాన్ లోని నీరు, ఐస్ అణువులతో కలవడం వల్ల మేఘాలు ఆకుపచ్చ రంగులోకి మారాయనీ, ఇదేమీ విపత్తు సూచిక కాదనీ చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sky-turned-to-green-colour-awonder-in-america-25-139307.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.