మంగళగిరి నుంచి స్కిల్ సెన్సెస్

Publish Date:Oct 1, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే  చేసిన తొలి  ఐదు సంతకాలలో స్కిల్ సెన్సెస్ ఒకటి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే  చంద్రబాబు తన మొదటి సంతకాన్ని మెగా డీఎస్సీ  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛన్‍ను రూ.4 వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు. ఈ నాలుగు హామీలూ అమలు అవుతున్నాయి. ఆయన  ఐదో సంత‌కం స్కిల్ సెన్సెస్ పై చేశారు. స్కిల్ సెన్సెస్ అన్నది అత్యంత కీలకమైనది. భవిష్యత్ లో ఇది దేశానికే ఆదర్శంగా మారుతుందని విద్యావంతులు, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ఇది అత్యంత కీలకంగా మారుతుందనడంలో సందేహం లేదు.  అటువంటి కీలక స్కిల్ సెన్సెస్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆరంభం కానుంది. 

ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా ప్ర‌పంచంలోని ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన ప్ర‌ముఖ కంపెనీలు భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశాలు ఉండ‌టంతో పాటు.. ఇక్కడ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు అందించేందుకు ఆస్కారం ఉంటుంది. స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్రంలోని ప్ర‌తీ ఇంటికి వెళ్లి స‌ర్వే చేస్తారు. ఆధార్ కార్డు ద్వారా ఇంట్లో ఎంత మంది చ‌దువుకున్న యువ‌త ఉన్నారు. వారు ఎంత‌వ‌ర‌కు చ‌దువుకున్నారు. ప్ర‌స్తుతం వారు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్న‌ట్ల‌యితే ఏ రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు. వారు ఏఏ కంపెనీలు, ఏఏ విభాగాల్లో ఉద్యోగం చేస్తున్నారు అనే వివ‌రాల‌ను సేక‌రిస్తారు. ఈ వివ‌రాల ద్వారా రాష్ట్రంలో ఆయా విభాగాల్లో ఉద్యోగం చేస్తున్న‌వారు ఎంత మంది ఉన్నార‌నే విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వానికి పూర్తి అవ‌గాహ‌న వ‌స్తుంది. దీనికి తోడు రాష్ట్రంలో ఉంటున్న యువ‌త‌కు వారికి ఆస‌క్తి ఉన్న‌రంగాల్లో శిక్ష‌ణ‌  ఇస్తారు. దీని వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పాటుగా రాష్ట్రంలో మ్యాన్ పవర్ కోసం చూస్తారు. ఎందుకంటే ఇత‌ర రాష్ట్రాల నుంచి ఉద్యోగుల‌ను ఇక్క‌డ‌కు తీసురావ‌డం ఒకింత కష్టమైన పని. దీంతో ఐటీ, నాన్ ఐటీ రంగాల‌కు చెందిన కంపెనీలు అన్నిసౌక‌ర్యాలు అందుబాటులో ఉన్న హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై వంటి రాష్ట్రాలవైపు మొగ్గు చూపుతారు. స్కిల్ సెన్సెస్ ద్వారా కంపెనీలకు అవసరమైన మ్యాన్ పవర్ రాష్ట్రంలోనే లభ్యమౌతుంది. దీంతో  పెట్టుబడి దారులు ఏపీవైపు మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి. 

స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం సేక‌రించిన డేటా ప్ర‌కారం.. రాష్ట్రంలో.. ఫైనాన్స్ విభాగం వారు ఇంత మంది ఉన్నారు.. ఎల‌క్ట్రిక‌ల్ విభాగం వారు ఎంత‌ మంది ఉన్నారు.. ఐటీ రంగంలో ప‌నిచేస్తున్న‌వారు ఎంత‌ మంది ఉన్నారు.. ఇలా ఇత‌ర రంగాల్లో ఏ విభాగంలో ఎంత‌మంది ఉన్నారు..? వారు ఎక్క‌డెక్క‌డ ప‌నిచేస్తున్నార‌నే విష‌యాలు ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంటాయి. వీటిని కంపెనీల ప్ర‌తినిధుల ముందు ఉంచి మా రాష్ట్రంలో మీరు పెట్టుబ‌డులు పెడితే ప్ర‌భుత్వం నుంచి మీకు అన్ని విధాల స‌హ‌కారం అందించ‌డంతోపాటు.. మీకు కావాల్సిన ఉద్యోగులుకూడా అందుబాటులో ఉంటార‌ని లెక్క‌ల‌తో స‌హా వివ‌రిస్తుంది.   చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఐదో సంత‌కం చేసిన స్కిల్ సెన్సెస్ రాష్ట్ర అభివృద్ధిలో కీల‌క భూమిక పోషించ‌బోతున్నది. ఒక‌ విధంగా చెప్పాలంటే.. బీసీ జ‌న‌ గ‌ణ‌న కంటే స్కిల్ సెన్సెస్ దేశంలో కీల‌కంగా మారే అవ‌కాశం ఉంది.  

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంగళగిరి నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. స్కిల్ సెన్సస్ కోసం 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెక్స్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యుమరేటర్లు స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్ సిద్ధంచేశారు.

ఎన్యుమరేటర్ల శిక్షణ కూడా పూర్తయింది. ఫీల్డ్ టీమ్స్ కు సహాయం చేసేందుకు టెక్నికల్ టీమ్ లను కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు, కుటుంబాలకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవల్ మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్ మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.