Publish Date:Oct 25, 2024
2019 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకున్న జగన్ ఆ ఎన్నికలలో విజయం కోసం రకరకాల వ్యూహాలు పన్నారు. ఇష్టారీతిగా హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టారు. అలాగే కోడికత్తిదాడి, సొంతబాబాయ్ హత్య ఘటనలను తనకు సానుభూతి వచ్చేలా మలచుకున్నారు. ఎన్నికల పబ్బం గడిచి, అధికార పగ్గాలు అందుకోగానే కొడికత్తి దాడి కేసు, వివేకా హత్య కేసుల దర్యాప్తునకు ఇసుమంతైనా సహకరించలేదు సరికదా, ఆ కేసుల దర్యాప్తునకు అడుగడుగునా అడ్డుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహనరెడ్డిపై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందని చెప్పబడుతున్న కోడికత్తి దాడికి ఆరేళ్లు పూర్తయ్యింది.
2018లో విశాఖపట్నంలో జగన్‌పై కోడి కత్తితో దాడికి పాల్పడ్డాడంటే జనుపల్లె శ్రీను అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. జగన్ మాత్రం తనపై దాడి వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ, రాష్ట్ర పోలీసుల విచారణపై నమ్మకం లేదని పట్టుబట్టి మరీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తునకు డిమాండ్ చేసి సాధించుకున్నారు. సరే ఎన్ఐఏ దర్యాప్తు చేసి జగన్ పై కోడికత్తి దాడి కేసు వెనుక ఎటువంటి కుట్రకోణం లేదని తేల్చేసింది. ఈ కేసులోదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొం టున్న జనుపల్లె శ్రీను బెయిలుకు కూడా నోచుకోకుండా దాదాపు ఐదేళ్ల పాటు జైల్లో మగ్గిపోయాడు.
2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ సంఘటన ద్వారా వచ్చిన సానుభూతి ఆ ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయానికి కారణాల్లో ఒకటి అయ్యింది. అలాగే అప్పట్లో జగన్ పై సానుభూతి వెల్లువెత్తడానికి మరో సంఘటన కూడా కారణమైంది. ఎన్ఐఏ ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని తేల్చేసిన తరువాత కూడా జగన్ కోర్టుకు హాజరై దాడి కేసులో బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడలేదు సరికదా.. ఎన్ఐఏ విచారణనే తప్పుపడుతూ లోతైన దర్యాప్తు పరపాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు.
ఇక్కడ ఒక విషయాన్నిచెప్పుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఒంటిపై గాయాలకు కుట్లు వేసి బ్యాండేజీలు కట్టి అది హత్య కాదు గుండెపోటు అని నమ్మించడానికి జగన్ విఫలయత్నం చేశారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ గత నాలుగేళ్లుగా కనీసం అరెస్టు కాకుండా హాయిగా తిరుగుతున్నారు. అరెస్టు చేస్తాం అని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు చెప్పింది. అయినా ఆయ నకు ముందస్తు బెయిలు వచ్చింది. కానీ హత్యాయత్నం కేసులో అరెస్టైన జనుపల్లె శ్రీనుకు మాత్రం ఐదేళ్ల పాటు బెయిలు దొరకలేదు. జనుపల్లె శ్రీనుకు బెయిలు రావాలంటే ఆ కేసులో బాధితుడిగా ఉన్న జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. జగన్ ఆ పని చేయలేదు. అప్పట్లో అంటే కోడికత్తితో జగన్ పై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడి వెనుక అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం కుట్ర ఉందంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న సాకుతో ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా తనపై జరిగిన దాడి కుట్రదారులకు శిక్ష పడాలని కేసు విచారణ వేగవంతం కావాలని కోరలేదు. పైపెచ్చు కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వకుండా కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా నత్తనడకన సాగేలా చేశారు. ఈకేసులో బెయిలుకు కూడా నోచుకోకుండా ఐదేళ్ల పాటు జైల్లో మగ్గిపోయిన జనుపల్లె శ్రీనుకు ఎట్టకేలకు కండీషన్డ్ బెయిలు లభించింది అది వేరే సంగతి. అయితే జగన్ తీరు కారణంగా ఇప్పటికే కేసు విచారణ పూర్తి కాలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/six-years-to-kodikatta-attack-on-jagan-25-187378.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.