ఆత్మ సాక్షిగా సీతక్క ఓటు!
Publish Date:Jul 18, 2022
Advertisement
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా, రాష్ట్ర పతి ఎన్నికల్లో ఓటు హక్కున ప్రతి ఒక్కరూ, తమ ఆత్మ సాక్షి మేరకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సిన్హాజీ, అధికార ఎన్డీఎ కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను ముఖ్యంగా బేజేపీలోని మాజీ మిత్రులను ఉద్దేశించి ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తిని అటు వారు ఎంతవరకు విన్నారో లేదో గానీ, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాత్రం, ‘ఆత్మ సాక్షి’ గానే, ఎన్డీఎ అభ్యర్ధి సాటి గిరిజన మహిళ ద్రౌపతి ముర్ముకు తొలి ప్రాధాన్యత ఓటు వేశారు. అయితే, ఆమె కావాలని ముర్ముకు ఓటు వేయలేదని, పొరపాటున అలా జరిగిపోయిందని వివరణ ఇచ్చారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు వేశారు. ఆ తర్వాత స్థిమితంగా నాలుక కర్చుకుని, పోరాపాటు జరిగిపోయిందని, ఒంకొక బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరారు. అయితే అందుకు, నిబంధనలు అనుమతించవని రిటర్నింగ్ అధికారి, ఆమె అభ్యర్ధనను తిరస్కరించారు. దాంతో ఆమె చేసేది లేక ఆ బ్యాలెట్ పేపర్’ నే పూర్తి చేసి డబ్బాలో వేశారు. అయితే సీతక్క పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును ముర్మూకి వేశారా? లేదంటే, కావాలనే ముర్ముకు ఓటేశారా? అనే చర్చ మొదలైంది. నిజానికి, సేతక్క పార్టీతో సంబంధం లేకుండా ఓటేయాలంటే, ముర్ముకే వేయాలి, సీతక్కలానే ముర్ము కూడా, సమాజంలో అణగారిన వర్గాలాకు ప్రతినిధిగా రాజకీయాలలో ఉన్నారు. ఒక్క పార్టీ కట్టుబాట్లు మినహా మిగిలి అన్ని విషయాల్లోనూ ఇద్దరిదీ ఒకటే స్వభావం. ఒకటే నైజం .సో .. ఆమె ముర్ముకు పొరపాటున ఓటేసినా, మనసు చెప్పిందనే ఓటేసినా, సేతక్క ఓటు చేరవలసిన వారికే చేరిందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/sitakka-vote-for-murmu-mistake-oc-conseiousness-39-140000.html





