Publish Date:Jan 19, 2026
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ ఆ నోటీసులో పేర్కొంది. సిట్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధిం చిన పలు అంశాలపై హరీష్ రావు నుంచి వివరణ తీసుకో నుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్, తాజాగా రాజకీయ నేతల వైపు దృష్టి సారించింది. ఇలా ఉండగా హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండి పడ్డారు.
రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పస లేదనీ, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేననీ పేర్కొన్న కేటీఆర్ ఈ విషయం తాను కాదనీ, సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతగా దిగజారిందో అర్థమవుతోందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి కి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే హరీష్ రావుకు నోటీసులు అని ఆరోపించారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం లో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ హరీష్ రావు చూపుతున్న చొరవ సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిస్తోందన్న కేటీఆర్, హరీష్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే, ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న కేటీఆర్, తమకు చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉంది, అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sit-notices-to-former-minister-harish-rao-39-212738.html
బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్‌తో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డిలు పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో వారు తెలంగాణ మునిసిపోల్స్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి కోరిక మన్నించి తెలంగాణ మునిసిపోల్స్ లో కమలం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి పవన్ అంగీకరించారు.
పరామర్శయాత్ర పేర ఆయన చేసిన ర్యాలీ గొల్లపూడి నుంచి ఇబ్రహీపట్నం చేరే లోపే రాంబాబు, భార్గవ్ అనే ఇద్దరు వైపీపీ కార్యర్తలు ప్రాణాలు కోల్పోయారన్నారు.
సింథటిక్ నెయ్యితో స్వామివారికి లడ్డూలు చేసి పెట్టిన పాపం ఊరకే పోలేదనీ, ఇప్పటికే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొందనీ అంటున్నారు. ఇక రోజా విషయానికి వస్తే.. ఆమెకు తిరుమల వెంకటేశ్వరస్వామిపై ఎంత భక్తి ఉందో.. అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిపైనా అంత భక్తి ఉంది. తరచూ ఆమె తిరుమల వెంకన్న స్వామివారిని, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారినీ దర్శించుకుంటూ ఉంటారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో మంత్రి నారా లోకేష్ కీలక దిశానిర్దేశం చేశారు.
అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట అంటే బుధవారం ఆయన అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ పేరుతో గుంటూరులో పర్యటించి పరామర్శ చేసిన సంరద్భంగా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బహుశా జగన్ పోలీసు ఆంక్షలకు తలొగ్గి శుక్రవారం తన ఇబ్రహీంపట్నం పర్యటనలో ‘రూటు’ మార్చారు. అంటే ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా పోలీసులు చెప్పినట్లుగా వారు సూచించిన దారిలో వెళ్లారు.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించుకోకపోవడానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.