సిట్, ఈడీల సమన్వయం.. ఏపీ లిక్కర్ స్కాం నిందితుల్లో భయం భయం!

Publish Date:Sep 19, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌ లో సిట్, ఈడీలు ఏకకాలంలో దూకుడు పెంచడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఖంగారు పెరిగిపోతున్నది. ఒక వైపు సిట్ ఈ కేసు దర్యాప్తులో మద్యం కుంభకోణం సొమ్ము అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తేల్చే దిశగా దర్యాప్తు చేస్తుంటే.. ఈడీ   ఈ మద్యం స్కాంకు సబంధించిన మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగిందో తేల్చే పనిలో పడింది. అందులో భాగంగానే ఈడీ గురువారం (సెప్టెంబర్ 18) ఏకకాలంలో పలు రాష్ట్రాలలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో  వైసీపీ పెద్దల్లో ఒక్కసారిగా కంగారు మొదలైంది.  

ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని భావించిన ఈ కేసులో నిందితులు.. ఈడీ ఎంట్రీతో స్కాం చెయిన్ గుట్టు మొత్తం రట్టౌంతుందన్న ఆందోళనలో పడ్డారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఇంకా సమన్లు అందుకోని వారూ, సిట్ రాడార్ లోకి రాలేదని సంబరపడుతున్నవారు ఉలిక్కి పడుతున్నారు. దర్యాప్తు తమ దాకా రావడానికి ఇంకెంతో కాలం పట్టదన్న ఆందోళనలో పడ్డారు. 

అన్నిటికంటే ముఖ్యంగా ఈడీ పక్కా సమాచారంతో, అంతకు మించి పక్కా ప్రణాళికతో సోదాలు నిర్వహిస్తున్నట్లు గురువారం (సెప్టెబర్ 18) సోదాలను గమనిస్తే అర్ధమౌతోంది.  లిక్కర్ స్కాము సొమ్ములు ఎవరెవరికి చేరాయి. బ్లాక్ ను వైట్ ఎలా చేశారు. అందుకోసం ఎవరెవరు ఎన్నెన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టారు. వంటి మొత్తం సమాచారం దగ్గరుంచుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

 ఈ తరహాలో ముందుకు వెడుతున్న ఈడీ మద్యం స్కాం సూత్రధారి ఎవరు అన్నది గుర్తించడానికి ఎంతో కాలం పట్టదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  సిట్, ఈడీలు పూర్తి సమన్వయంతో  దర్యాప్తు చేస్తున్నాయని అవగతమౌతోందని అంటున్నారు.  మనీలాం డరింగ్ ద్వారా విదేశాలకు నగదు ఎలా వెళ్లింది అన్న విషయంపై దర్యాప్తు చేసిన ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పుడు అలా విదేశాలకు వెళ్లిన సొమ్ము వైట్ గా మారి ఎక్కడికి ఎలా చేరిందన్న విషయంపై దృష్టిసారిస్తుందని అంటున్నారు.  

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.