టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి యాపిల్ నాంది పలికింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా జరిగిన వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో ఐఫోన్ ప్రియుల కోసం అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఐవోఎస్ 27 సాఫ్ట్‌వేర్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధానమైన అప్‌డేట్ ఏంటంటే.. అది పూర్తిస్థాయిలో రీబిల్ట్ చేసిన సిరి ఏఐ. కృత్రిమ మేధస్సు రంగంలో దూసుకుపోతున్న గూగుల్ జెమిని సాంకేతికతతో పాటు, నెక్స్ట్ జనరేషన్ యాపిల్ ఫౌండేషన్ మోడల్స్ సహాయంతో ఈ వాయిస్ అసిస్టెంట్‌ను యాపిల్ డెవలప్ చేసింది. దీనివల్ల ఇకపై సిరి కేవలం ఒక కమాండ్ ఫాలో అయ్యే టూల్‌లా కాకుండా.. అత్యంత సహజంగా సంభాషించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వినియోగదారుల ప్రైవసీని యాపిల్ ఇక్కడ కూడా కొనసాగించింది. డేటా అంతా డివైస్ లోపలే ప్రాసెస్ అయ్యేలా డిజైన్ చేసింది.
ఈ సరికొత్త సిరి ఏఐ ఫీచర్లు యూజర్ల రోజువారీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని మార్చేయనున్నాయి. మెసేజ్, మ్యాప్స్ వంటి ఇన్-బిల్ట్ యాప్స్ ద్వారా యూజర్ల వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతలను ఇది సులభంగా అర్థం చేసుకుంటుంది. దీనికి ఉన్న మరో ఫీచర్ ఏంటంటే ఐఫోన్ స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని స్వయంగా గ్రహించి, స్క్రీన్ కాంటెక్స్ట్‌ను బట్టి ఈమెయిల్‌లు, టెక్స్ట్‌లు లేదా ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎడిట్ చేస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా హిస్టరీని ట్రాక్ చేసుకునేలా ఒక స్టాండ్‌అలోన్ యాప్‌ను కూడా యాపిల్ జోడించింది.
అలాగే హోమ్ స్క్రీన్‌పై డైనమిక్ ఐలాండ్ ఇంటిగ్రేషన్‌తో ఈ ఏఐ వాయిస్ అసిస్టెంట్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఐవోఎస్ 27 అప్‌డేట్ కేవలం సిరికే పరిమితం కాలేదు.. దీని ద్వారా అడ్వాన్స్‌డ్ ఫోటో ఎడిటింగ్, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి మైండ్ బ్లోయింగ్ యాపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ 2026 చివర్లో సాధారణ యూజర్లందరికీ గ్లోబల్ రోలౌట్ ద్వారా ఇంగ్లిష్‌తో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లో ఈ కీలక అప్‌డేట్స్ లభించనున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/siri-ai--ios-27-apple--new-innovation-36-222290.html
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సుమారు 20,000 మంది అభ్యర్థుల హైరింగ్ పరీక్షలను అకస్మాత్తుగా రద్దు చేసింది. ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌లో జరిగిన అక్రమాలే దీనికి కారణమా? ఫ్రెషర్ల ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలు సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక సడలింపులు ఇచ్చింది. బడ్జెట్ 2026 పరిమితుల కంటే మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐదేళ్లలో 690% మరియు పదేళ్లలో 1040% భారీ లాభాలను అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ గ్యాబ్రియేల్ ఇండియా (Gabriel India) పై మోతీలాల్ ఓస్వాల్ సానుకూల రేటింగ్ ఇచ్చింది. మరో 30% లాభాల అంచనాతో రూ. 1266 టార్గెట్ ధరను ప్రకటించింది. ఈ స్టాక్ పూర్తి వివరాలు, ఆర్థిక బలం మరియు భవిష్యత్తు వృద్ధి అంచనాలను ఇక్కడ చూడండి.
ఆర్‌బీఐ సరికొత్త డాలర్-రూపాయి స్వాప్ ఫెసిలిటీ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ పరుగులు పెడుతోంది. SBI, ICICI, IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లలో భారీ లాభాలు రావడానికి గల అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
1999లో ఒక రైతు కుటుంబం పార్కు కోసం కేవలం 10 డాలర్లకే 87 ఎకరాల భూమిని ఇస్తే, టేలర్ నగరం దాన్ని 10 మిలియన్ డాలర్లకు డేటా సెంటర్ నిర్మించడానికి అమ్మేసింది. ఈ గుండె బరువెక్కించే పూర్తి కథనం చదవండి.
చాట్‌జీపీటీ చరిత్రలోనే అతిపెద్ద మార్పుకు ఓపెన్ఏఐ శ్రీకారం చుట్టింది. కేవలం చాటింగ్ చేసే రోజులకు కాలం చెల్లిందంటూ చాట్‌జీపీటీని సరికొత్త సూపర్ యాప్గా మారుస్తున్నారు. ఈ సంచలన మార్పుల వెనుక ఉన్న పూర్తి వివరాలు, కొత్త ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రాథమికంగా తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. స్థానిక ప్రజలు ఎక్కడైనా రోడ్డుపై పెద్ద గుంతలు, అంటే ప్రయాణానికి ఇబ్బంది కలిగించే గతుకులు, గుంతలను గమనిస్తే, వెంటనే వాటి ఫోటోలను తీసి, పూర్తి సమాచారంతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఎలోన్ మస్క్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX) తన మోస్ట్ అవేటెడ్ ఐపీఓ (IPO) తో మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. జూన్ 12 నుంచి షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుండగా.. షేర్ ధర, వాల్యుయేషన్, ఇన్వెస్టర్ల కోటా పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వైజాగ్‌కు చెందిన తెలుగు విద్యార్థి అక్షత్ శ్రీవాస్తవ ఆపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ 2026 విజేతగా నిలిచి, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను కలిశాడు. అతను రూపొందించిన AI ఎడ్యుకేషన్ యాప్ STEMQuest వివరాలు, WWDC ఈవెంట్ విశేషాలు మరియు అతని సక్సెస్ స్టోరీని ఇక్కడ చూడండి.
15 ఏళ్ల భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ బ్యాటింగ్ బ్రయాన్ లారా, గ్యారీ సోబర్స్‌ను గుర్తుచేస్తోందని, అతని 72 సిక్సర్ల విధ్వంసంపై మెక్‌గ్రాత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇక్కడ చూడండి.
మహిళల టీ20 ప్రపంచకప్ మొదటి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 26 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. భారతీ ఫుల్మాలి (56*) హాఫ్ సెంచరీతో మెరవగా, శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని ఉందంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది.
సోమవారం మధ్యాహ్నం క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే.. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని హర్మూజ్‌గాన్ ప్రావిన్స్‌లో మరో భూకంపం సంభవించింది. ఈ రెండు భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. క్యూబా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 6.1 గా నమోదైంది.