యాపిల్ కొత్త ఆవిష్కరణ.. సిరి ఏఐ, ఐవోఎస్ 27!

Publish Date:Jun 8, 2026

Advertisement

టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి యాపిల్  నాంది పలికింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా జరిగిన వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో ఐఫోన్ ప్రియుల కోసం అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఐవోఎస్ 27   సాఫ్ట్‌వేర్‌ను కంపెనీ   ఆవిష్కరించింది. ఈ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధానమైన అప్‌డేట్  ఏంటంటే.. అది పూర్తిస్థాయిలో రీబిల్ట్ చేసిన సిరి ఏఐ. కృత్రిమ మేధస్సు రంగంలో దూసుకుపోతున్న గూగుల్ జెమిని సాంకేతికతతో పాటు, నెక్స్ట్ జనరేషన్ యాపిల్ ఫౌండేషన్ మోడల్స్ సహాయంతో ఈ వాయిస్ అసిస్టెంట్‌ను యాపిల్ డెవలప్ చేసింది. దీనివల్ల ఇకపై సిరి కేవలం ఒక కమాండ్ ఫాలో అయ్యే టూల్‌లా కాకుండా..  అత్యంత సహజంగా సంభాషించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వినియోగదారుల ప్రైవసీని యాపిల్   ఇక్కడ కూడా కొనసాగించింది. డేటా అంతా డివైస్ లోపలే ప్రాసెస్ అయ్యేలా  డిజైన్  చేసింది.

ఈ సరికొత్త సిరి ఏఐ ఫీచర్లు యూజర్ల రోజువారీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని  మార్చేయనున్నాయి. మెసేజ్, మ్యాప్స్ వంటి ఇన్-బిల్ట్ యాప్స్ ద్వారా యూజర్ల వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతలను ఇది   సులభంగా అర్థం చేసుకుంటుంది. దీనికి ఉన్న మరో   ఫీచర్ ఏంటంటే  ఐఫోన్ స్క్రీన్‌పై ఉన్న సమాచారాన్ని  స్వయంగా గ్రహించి, స్క్రీన్ కాంటెక్స్ట్‌ను బట్టి ఈమెయిల్‌లు, టెక్స్ట్‌లు లేదా ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎడిట్ చేస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా హిస్టరీని ట్రాక్ చేసుకునేలా ఒక స్టాండ్‌అలోన్ యాప్‌ను కూడా యాపిల్ జోడించింది.

అలాగే హోమ్ స్క్రీన్‌పై డైనమిక్ ఐలాండ్ ఇంటిగ్రేషన్‌తో ఈ ఏఐ వాయిస్ అసిస్టెంట్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఐవోఎస్ 27 అప్‌డేట్ కేవలం సిరికే పరిమితం కాలేదు..  దీని ద్వారా అడ్వాన్స్‌డ్ ఫోటో ఎడిటింగ్, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి మైండ్ బ్లోయింగ్ యాపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.    ఈ 2026   చివర్లో సాధారణ యూజర్లందరికీ గ్లోబల్ రోలౌట్ ద్వారా ఇంగ్లిష్‌తో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లో ఈ కీలక అప్‌డేట్స్ లభించనున్నాయి.

By
en-us Political News

  
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.