ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
374 పరుగల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఒక దశలో సునాయాసంగా విజయం సాధిస్తుందా అనిపించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ధారాళంగా పరుగులు చేయడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. హ్యారీ బ్రూక్, జోరూట్ లు సెంచరీలతో చెలరేగడంతో 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించేస్తుందని అంతా భావించారు. అయితే జోరుమీదున్న ఇంగ్లాండ్ కు ప్రసిద్ధకృష్ణ, మహ్మద్ సిరాజ్ లు కళ్లెం వేశారు. ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగుల వద్ద నాలుగో రోజు ఆట ముగించిన ఇంగ్లాండ్.. నాలుగు వికెట్లు చేతిలో ఉండటంతో అలవోకగా విజయం సాధిస్తుందని అంతా భావించారు.
అయితే మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలు పదునైన బంతులతో ఇంగ్లాండ్ దూకుడుకు కళ్లెం వేశారు. ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ జెమీ స్మీత్ ఓవర్టన్ లను సిరాజ్ పెవిలియన్ కు పంపాడు. జోష్ టంగ్ ను ప్రసిద్ధ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో గాయంతో బాధపడుతున్న క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ దశలో ఇంగ్లాండ్ కు విజయానికి 17 పరుగులు అవసరం. గాయంతో ఉన్న వోక్స్ కు స్ట్రైక్ ఇవ్వకుండా అట్కిన్సన్ ఓవర్ కీప్ చేస్తూ బ్యాటింగ్ కొనసాగించాడు. ఓ సిక్సర్ బాదిన అట్కిన్సన్ ఇంగ్లాండ్ విజయంపై ఆశలను పెంచేశాడు. ఇంగ్లాండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన స్థితిలో అట్కిన్సన్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేసి ఇండియాకు చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించాడు.
స్కోర్లు.. ఇండియా తొలి ఇన్నింగ్స్ 224, రెండో ఇన్నింగ్స్ 396
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 247, రెండో ఇన్నింగ్స్ 367
ఫలితం ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం
నాలుగు వికెట్లను 29 పరుగులకే కూల్చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/siraj-mafic-india-win-5th-test-by-six-runs-39-203472.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.