జల యుద్ధానికి ఉగ్ర కుట్ర?!..

Publish Date:Jul 17, 2026

Advertisement

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా  భారతదేశంపై మరో  కుట్రకు తెరలేపింది. భారత సరిహద్దుల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా ఉంచడంతో, ఈసారి భూమార్గాలను విడిచిపెట్టి జలమార్గాల ద్వారా చొరబడేందుకు  వాటర్ ఫోర్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఈ  వాటర్ ఫోర్స్  నీటి అడుగున ఉండి పోరాడేందుకు  ఇస్తున్న   శిక్షణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో   బహిర్గతం కావడంతో లష్కరే ఉగ్రకుట్ర బయటపడింది.   దీంతో భారత నిఘా  రక్షణ వర్గాలు  అలర్టయ్యాయి. 

 పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని   పంజాబ్ సరిహద్దుల మధ్య ఉన్న  మంగ్లా డ్యామ్ వేదికగా లష్కరే ఈ ఉగ్ర శిక్షణ ఇస్తుండటం.. ఆందోళన కలిగిస్తున్నది.  2008 నవంబర్ 26న ముంబై   దాడులకు తెగబడ్డ అజ్మల్ కసబ్ బృందం కూడా అప్పట్లో..   ఇదే మంగ్లా డ్యామ్‌లో నావిగేషన్, సముద్రయాన శిక్షణ పొందింది. ఇప్పుడు మళ్లీ అదే   స్థలంలో లష్కరే కమాండర్  మహమ్మద్ అష్ఫాక్ పర్యవేక్షణలో వాటర్ ఫోర్స్ శిక్షణ సాగుతుండటం గమనార్హం.  ఈ శిక్షణలో భాగంగా..  ఉగ్రవాదులు  కంబాట్ స్విమ్మింగ్,  స్కూబా డైవింగ్ పరికరాల సహాయంతో గంటల తరబడి నీటి అడుగున ఉండడం,  అత్యాధునిక హై-స్పీడ్ రబ్బర్ బోట్లను నడపడంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు లీకైన విడియోలు వెల్లడిస్తున్నాయి. 

ఈ ప్రమాదకర కుట్ర వెనుక అసలు సూత్రధారి, అమెరికా ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన హారిస్ దార్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఇటీవల పాకిస్తాన్‌లోని షేక్‌పురా ప్రాంతంలో లష్కరే కొత్త రిక్రూట్లకు శిక్షణ ఇస్తూ  భారత సార్వభౌమాధికారానికి నేరుగా సవాలు విసిరేలా వ్యాఖ్యలు చేశారు.  ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్  సింధు జలాల ఒప్పందాన్ని  నిలిపివేయడాన్ని ప్రస్తావిస్తూ.. దార్  ఇండియా  తమ నీటిని ఆపాలని చూస్తే..  తాము భారతీయుల ఊపిరి ఆపేస్తామని పేర్కొన్నాడు.    2026లో అంటే ప్రస్తుత సంవత్సరంలోనే ఇండియాపై వాటర్ వార్ చేస్తామంటూ దార్ హెచ్చరించాడు. ఇప్పుడు   మంగ్లా డ్యామ్ లో ఉగ్ర శిక్షణ జరుగుతుండటం గమనార్హం.  పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న ప్రత్యక్ష, పరోక్ష మద్దతుకు ఈ మంగ్లా డ్యామ్ శిక్షణా దృశ్యాలే   సాక్ష్యమని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

 నిఘా వర్గాల  విశ్లేషణ ప్రకారం, లష్కరే తోయిబా కేవలం సాంప్రదాయ ఆయుధాలు,  భౌతిక దాడులకే పరిమితం కాకుండా,  తమ వ్యూహాన్ని మార్చి ఏఐ, సైబర్ దాడులు, డీప్‌ఫేక్ ప్రచారాలను కూడా ఆయుధాలుగా వాడుకుంటోంది. ఇండియాలో అలజడి సృష్టించడానికి, క్లిష్టమైన సమాచారాన్ని చోరీ చేయడానికీ   ఏఐ టూల్స్ వినియోగిస్తోంది. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు సోషల్ మీడియా ద్వారా భారతీయ యువతను తప్పుదోవ పట్టించేందుకు హైక్వాలిటీ వీడియోలను  మానసిక యుద్ధ తంత్రంలా ఉపయోగిస్తోంది.  

అయితే పాక్ నుంచి వచ్చే ఎలాంటి సవాలునైనా దీటుగా ఎదుర్కొని కోలుకోలేని దెబ్బతీయడానికి భారత్ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉంది.  అంతర్జాతీయ రక్షణ అధ్యయన సంస్థ  సిప్రి' నివేదికల ప్రకారం,  ఇండియా రక్షణ చర్యలలో భాగంగా మున్నెన్నడూ లేనంతగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో  భాగంగా ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ అరిహంత్ వంటి అణు జలాంతర్గాములలో న్యూక్లియర్ వార్‌హెడ్‌లను  భారత్ లైవ్‌గా సన్నద్ధం చేసింది. శత్రు దేశాల నుండి ఎలాంటి జల చొరబాట్లు,  దాడులు జరిగినా.. క్షణాల వ్యవధిలో కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ కొట్టేందుకు నౌకాదళాన్ని సర్వసన్నద్ధం చేసింది. 

అలాగే.. గుజరాత్ తీరం నుండి ముంబై, కేరళ మీదుగా విస్తరించి ఉన్న  తీరప్రాంతం వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్, నౌకాదళం   గస్తీని ముమ్మరం చేశాయి. సముద్ర మార్గాల్లో అనుమానాస్పద బోట్ల కదలికలను ముందే గుర్తించేందుకు వీలుగా తీరప్రాంత రేడార్ వ్యవస్థలను ఆధునీకరించారు.  లష్కరే జల యుద్ధ హెచ్చరికల నేపథ్యంలో, శత్రువుల ఆటకట్టించడానికి భారత్ ప్రదర్శిస్తున్న సైనిక నిశ్చయత దేశ భద్రతా పరంగా అత్యంత కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో తీరప్రాంత నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని రక్షణ శాఖ భావిస్తోంది.

Lashkar e Taiba,  Water Force, Mangla Dam Terror Training, Indus Waters Treaty 2026, Haris Dar Pakistan, Indian Navy INS Arihant High Alert

By
en-us Political News

  
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.