సింగరేణి టెండర్లపై ఆరోపణలు అవాస్తవం : డిప్యూటీ సీఎం భట్టి

Publish Date:Jan 24, 2026

Advertisement

 

సింగరేణి సంస్థ టెండర్లపై తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తప్పుడు కథనాలు రాసిన ఏబీఎన్ రాధాకృష్ణ తన రాతలు అసత్యమని స్వయంగా ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే అవి తన వ్యక్తిత్వ హననంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శనివారం జ్యోతిరావు పూలే భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ…
సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ నిబంధనను తాము కొత్తగా తీసుకురాలేదని తెలిపారు. ఈ నిబంధన ఇప్పటికే కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఆయిల్ కంపెనీలు, డిఫెన్స్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో చాలా ఏళ్లుగా అమలులో ఉందన్నారు. సీఎంపీడీఐఎల్ సూచనల మేరకు 2018 నుంచే సింగరేణిలో ఈ విధానం కొనసాగుతోందని స్పష్టం చేశారు.

సింగరేణి టెండర్లు రాజకీయ జోక్యంతో జరుగుతున్నాయన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సింగరేణి ఒక స్వయంప్రతిపత్తి సంస్థ అని, టెండర్లపై నిర్ణయాలు బోర్డు మరియు సీనియర్ అధికారులు విధివిధానాల ప్రకారం తీసుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా తన వద్దకు టెండర్ ఫైళ్లు రావని స్పష్టం చేశారు.

డీజిల్ సరఫరా కాంట్రాక్టర్లకు అప్పగించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలపైనా స్పందించారు. ఈ విధానం 2022లోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలులోకి వచ్చిందని చెప్పారు. జీఎస్టీ మార్పులు, డీజిల్ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

నైనీ బ్లాక్ టెండర్ విషయంలో సీఎం రేవంత్ బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చారన్న ప్రచారాన్ని ఖండించారు. సుజన్ రెడ్డి కంపెనీకి ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థ యజమాని మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమార్తె అని తెలిపారు. సింగరేణిలో ప్రధాన కాంట్రాక్టర్లు చాలామంది బీఆర్ఎస్‌కు సంబంధించిన వారేనని కూడా గుర్తు చేశారు.

2014 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లు, కాంట్రాక్టులపై విచారణకు సిద్ధమని భట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆయనను కలిసి విచారణకు ఆదేశాలు ఇప్పిస్తానన్నారు.“సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి. దీనిపై రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం. కార్మికుల రక్తం, చెమటతో ఏర్పడిన ఈ సంస్థను రాబందులకు అప్పగించను” అని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.

సింగరేణి బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు, భవిష్యత్తులో క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చివరగా, తనపై తప్పుడు ప్రచారాలు చేసిన రాధాకృష్ణ తన రాతలు అవాస్తవమని తిరిగి రాసి ప్రజలకు చెప్పాలని, లేకపోతే తదుపరి చర్యలు తప్పవని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు.
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు. అక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో  సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు.
ప్రముఖ హెల్త్‌కేర్ టెక్నాలజీ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు,  వైస్ ఛైర్మన్‌ ఈ వర్ధమాన్ జైన్. వ్యాపార రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు   ఆధ్యాత్మిక, సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఏకకాలంలో మానవ సేవా, మాధవ సేవా చేస్తుంటారు.
చెన్నై నగరానికి చెందిన వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం   ఈవో ని కలిసి, తాను సమర్పిస్తున్న బంగారు ఆభరణాలకు సంబంధించిన అధికారిక పత్రాలను అందజేశారు. ఆభరణాల అప్పగింతకు సంబంధించిన నిబంధనలు, ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఈ డాక్యుమెంట్లను ఈవోకు సమర్పించారు.  
కఠినమైన చికిత్సల మధ్య కూడా బాలిక ముఖంలో చిరునవ్వు, ఆసుపత్రి సిబ్బంది చూపిన మానవీయ కోణం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వైద్యుల అంకితభావం వల్లే ప్రాణాలు నిలిచాయంటూ   ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ఆయన మంగళవారం (నవంబర్ 24) అమ్రాబాద్, ఉడుమిల్ల పరిసరాల్లో పర్యటించారు. అమ్రాబాదు శివాలయంలో కాకతీయుల కాలపు అత్యంత కళాత్మకమైన నంది విగ్రహం, ఆలయం వెనుక, ప్రాకారంగోడ పక్కనే మట్టిలో కూరుకు పోయిందన్నారు.
 భక్తులు గోదావరి, కృష్ణా వంటి పుణ్యనదుల స్నానఘట్టాల వద్దకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. స్నానాల అనంతరం కార్తిక దీపాలను వెలిగించి, నదీ జలాల్లో వదులుతూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి కావడంతో, ఆ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు భక్తులకువైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు  టీటీడీ ప్రకటించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.  సంస్థ కార్యాలయాలు, సంబంధిత ప్రాంగణాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ అధికారులు విస్తృతంగా పరిశీలన జరిపారు.
ఈ పురాతన క్షేత్రంలో భారీ మర్రి, రావి చెట్ల వేర్లు, ఊడల తొర్రలో శివలింగ రూపం కనిపించడం ఆధ్యాత్మిక విశేషంగా నిలుస్తోంది. కార్తీక మాసంలో  స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించి పునీతులౌతారు.
అర్ధరాత్రి  దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలు వచ్చేలా టపాసులు కాలుస్తూనే ఉన్నారని పేర్కొన్న రేణూ దేశాయ్ పండుగ రోజుల్లో తాను ఏదైనా మాట్లాడితే అనవసరంగా తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే భయంతోనే  దీపావళి రోజు తాను మౌనంగా ఉన్నానన్నారు.,
. తామిరువురం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరుసంపూర్ణ గౌరవంతో విడిపోతున్నామని వారా ప్రకటనలో పేర్కొన్నారు.   తమ వివాహ బంధం ఒక ముగింపునకు వచ్చిందని పవన్, అన్నా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా తమ విడిపోయినప్పటికీ స్నేహితులుగా  కలిసే ఉంటామని పేర్కొన్నారు.
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు,  సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే ఈ వైరల్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం,  షేర్ చేయడం తక్షణమే ఆపాలని సురేఖ వాణి  పేర్కొన్నారు.
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.