Publish Date:Jul 29, 2025
సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు.. అక్కడి పారిశ్రామికవేత్తల నుంచే కాకుండా ఆ దేశ మంత్రుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. సింగపూర్ నైపుణ్యాలు ఏపీకి అవసరం అంటూ చంద్రబాబు అక్కడి పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు, ప్రభుత్వాన్ని కోరుతుంటే.. అందుకు ప్రతికా వారి నుంచి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
చంద్రబాబుతో ఐదు నిమిషాల భేటీ చాలు ఏపీలో పెట్టుబడులపై సానుకూల నిర్ణయం తీసుకోవడానికి అని ఇండస్ట్రియలిస్టులు, ఇన్వెస్టర్లు అంటుంటూ.. చంద్రబాబు పని తీరు అద్భుతం, ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి అంటూ సింగపూర్ మంత్రులు పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ చంద్రబాబు పని చేసే తీరు.. ప్రగతి పట్ల ఉన్న దార్శనికత అద్భుతమంటూ ప్రశంసించారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్‌తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఏపీ రూపాంతరం చెందుతోందని.. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనిసూచించారు.
దీనిపై సానుకూలంగా స్పందించి టాన్ సీలాంగ్, నిరంతరం.. ప్రజల కోసం పని పని చేస్తుండటం మీకెలా సాధ్యమౌతోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకం కావడం నుంచి వారి సమస్యల పరిష్కారం వరకూ చంద్రబాబు తీసుకుంటున్నశ్రద్ధ అనితర సాధ్యమని ప్రశంసించారు. టాన్ సీలాంగ్ తో భేటీ సందర్భంగా గృహనిర్మాణం, సముద్రంలో కేబుల్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదిరాయి. చంద్రబాబుతో కలిసి పని చేయడానికీ తాము ఉత్సుకతతో ఉన్నామని టాన్ లాసింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ అంతే నాణ్యతతో కొనసాగుతుండటానికి కారణం చంద్రబాబు విజనే అని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/singapore-minister-praises-cbn-work-culture-39-203021.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.