సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణం : షర్మిల
Publish Date:Jun 23, 2025
Advertisement
సింగయ్య మృతికి ముమ్మాటికి వైసీపీ అధినేత జగన్ నిర్లక్ష్యమే కారణమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మానవత్వమే లేదు.ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శ చేయలేదని షర్మిల ప్రశ్నించారు. క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమని ఆమె పేర్కొన్నారు. మానవత్వం ఉంటే 5 కోట్లో, 10 కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలని తెలిపారు. 5 ఏళ్లు కుంభకర్ణ నిద్ర పోయి.. ఇప్పుడు ప్రజా సమస్యలు అంటూ బయలు దేరడం విడ్డూరంగా ఉందని షర్మిల విమర్మించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డివి బల ప్రదర్శన... జన సమీకరణ కార్యక్రమాలు తప్ప... ఏ ఒక్కటి ప్రజల కోసం ఉండబోవని వెల్లడించారు. జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండని... జనాలను చంపకండి అంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి షర్మిల కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కోరారు. ఇది ఇలా ఉండగా.. ఈ సంఘటనపై ఇవాళ వైయస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టారు. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి... వైసిపి పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగయ్య మృతికి కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణమని జగన్ ట్వీట్ చేశారు.కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలని షర్మిల డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/singaiah-25-200527.html





