విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాల చోరీ.. మండిపడ్డ టీడీపీ

Publish Date:Sep 16, 2020

Advertisement

ఏపీలోని వివిధ హిందూ ప్రార్థన స్థలాలలో వరుసగా జరుగుతన్న ఘటనలు రాష్ర ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అంతర్వేది రథం దగ్ధం ఘటన మరవక ముందే తాజాగా విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోని రథంపై దుమారం రేగుతోంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉత్సవ వెండి రథంపై ఉండాల్సిన మూడు వెండి సింహాలు మాయమవడం సంచలనం ‌గా మారింది. ఈ రథంపై మొత్తం నాలుగు వెండి సింహాలు ఉండేవి. అయితే ప్రస్తుతం మూడు సింహాలు మాయమయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రథంపై మూండు సింహాలు మాయం కావడంతో దుర్గమ్మ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అంతేకాకుండా ఈ విషయం పై ఆలయ ఈవో నీళ్లు నమలడం దొంగలకు వత్తాసు పలకడమేననని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఈ చోరీ వెనుక ఎవరి హస్తం ఉంది.. ఎవరిని రక్షించడానికి మీరు దీనిని కప్పిపెట్టాలని చూస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. వెండి సింహాల మాయం ఘటనపై వెంటనే నిజానిజాలు బయటపెట్టాలని అయన డిమాండ్ చేశారు.

 

రాష్ట్రంలో "వైసిపి అధికారంలోకి వచ్చాక ఏ గుడికి భద్రత లేకుండా పోయింది. వైసిపి నాయకులు ఏకంగా గుడిని, గుడిలో లింగాన్ని మింగేసేలా ఉన్నారు. దేవాదాయ భూముల ఆక్రమణల దగ్గర నుండి, రథాలకు నిప్పు, విగ్రహాల ధ్వంసం, వెండి తాపడాల మాయం, ఇలా రోజుకో నేరం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగలు, దగాకోర్లు ఆలయాల్లో తిష్టవేసి అరాచకాలు చేస్తున్నా సీఎం చోద్యం చూస్తున్నారు. ఆలయాల్లో చోరీలు, విధ్వంసాలు, అరాచకాలు చేస్తున్న నేరగాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలి. భక్తుల మనోభావాలను గౌరవించాలి. అంతేకాకుండా 15నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో జరిగిన అరాచకాలపై సిబిఐ విచారణ జరిపించాలి.'' అని బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు, విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్‌తో సమావేశమై దుర్గగుడిలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చలు జరిపారు. తరువాత ఆలయ ఈవో, ఇతర సిబ్బంది కలిసి ఉత్సవ రథాలను పరిశీలించారు. అప్పుడు వెండి రథంపై ఉండాల్సిన మూడు వెండి సింహాలు మాయమైన విషయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా నాలుగో సింహాన్ని కూడా పెకలించి ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. వీటిలో ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారని.. ఈ లెక్కన మొత్తం రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైనట్లు సమాచారం. ఐతే ఆలయ అధికారులు మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. దీని పై దుర్గ గుడి ఈవో సురేశ్ స్పందిస్తూ రథంపై ఉన్న సింహాలు మాయమయ్యాయని తాను అనుకోవడం లేదని అన్నారు. ఆలయ రికార్డులను పరిశీలించి సింహాలు గతంలో ఉన్నాయో లేవో తేల్చడానికి 3 రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు.

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.