Publish Date:Jun 29, 2025
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉందా? అసలు ఏపీలో బీజేపీ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లభించడం లేదు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటమే కాకుండా.. తన వంతుగా కేబినెట్ లోనూ, నామినేటెడ్ పోస్టులలోనూ పదవులు తీసుకుని కూడా.. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వంపై సంధిస్తున్న విమర్శలను ఖండించడం కానీ, దీటుగా స్పందించడం కానీ చేయడం లేదని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఏపీలో బీజేపీ నేతల తీరు.. ప్రభుత్వంపై విమర్శలకు స్పందించాల్సిన బాధ్యత తమది కాదు.. కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుుదేశం పార్టీది మాత్రమే అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ సీనియర్ నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా.. పరామర్శ యాత్రల పేరుతో నిబంధనలు తుంగలోకి తొక్కి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వ్యవహరిస్తున్నా.. బీజీపీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారే తప్ప పెదవి విప్పి విమర్శలు చేయడం లేదు.
వైసీపీనీ, జగన్ని ఎదుర్కోవలసిన బాధ్యత సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, అలాగే తెలుగుదేశం, జనసేనలదే అన్నట్లు మౌనంగా ఉండిపోతున్నారు. వచ్చే నెల 1న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ శాఖలకు కొత్త అధ్యక్షుల ఎంపిక జరగ నుంది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం అక్కడి నేతలలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు కాదు.. భవిష్యత్ లో కూడా ఏపీలో బీజేపీ స్టేక్ పెరిగే అవకాశం కనిపించడం లేదన్న భావనో ఏమో.. ఇంతోటి దానికి అధ్యక్ష పదవి కోసం పోటీ ఎందుకు అన్న నిర్లిప్తతతో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/silince-in-ap-bjp-39-200871.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.