చిక్కుల్లో సిద్దు కాంగ్రెస్’లో కలవరం

Publish Date:Jun 18, 2022

Advertisement

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య నోరు జారారు. అది కూడా ఒక అధికార పార్టీ  దళిత ఎమ్మెల్సీ మీద నోరు జారారు. నోరు జారడం అంటే ఎదో ఒక మాటనడం కాదు ... దళిత ఎమ్మెల్సీని చలవాది నారాయణస్వామిని కులం పేరుతో దూషించారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. పోలీసు కేసు పెట్టారు. సిద్దరామయ్య తనను కులం పేరుతో దూషించాడని, చలవాది నారాయణస్వామి మాజే మఖ్యమంత్రి పై ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెట్టారు.

పోలీసులు కేసు నమోడు చేసారు. ఇటీవలే బీజేపీ టికెట్ పై ఎమ్మెల్సీ గా గెలిచిన చలవాది నారాయణస్వామి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పడ బీజేపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇలా ఎమ్మెల్సీ అయిన వెంటనే సిద్దరామయ్య పై  ఏకంగా ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెట్టడం, రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో అయన కేసు ఫైల్ చేసారు. అదలా ఉంటే చలవాది నారాయణస్వామి, మాజీ ముఖ్యమంత్రి గత గత చరిత్రను కూడా ఏకరువు పెట్టారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల నుంచి సిద్దరామయ్యకు దళితులంటే చిన్న చూపేనని, ఆయన ఎప్పుడు దళితులకు విలువ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొనారు.

అలాగే, కేసు నమోదు చేసిన సందర్భంగా మీడియాతో మాటలాడిన ఎమ్మెల్సీ నారాయణస్వామి తనను కులం పేరుతొ దూషించడమే కాకుండా, దళితజాతి మొత్తాన్ని అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.అందుకే, యన పై తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నా, కేసు పెట్టవలసి వచ్చిందని నారాయణస్వామి అన్నారు. సిద్దరామయ్యను అరెస్టు చెయ్యడంలో పోలీసులు ఆలస్యం చేస్తే తాను నిరాహారదీక్షకు దిగి ధర్నా చేస్తానని ఎమ్మెల్సీ హెచ్చరించారు. 

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి, దళితురాలు మోటమ్మకూడా తన ఎదుగుదలకు మాజీ సీఎం సిద్దరామయ్య అడ్డుపడ్డారని ఆమె ఆత్మకథలో రాశారని, మోటమ్మ విషయంలో, నా విషయంలో సిద్దరామయ్య తీరు గమనిస్తే ఆయన దళితులకు మర్యాద ఇవ్వరని అర్థం అవుతోందని చలవాది అన్నారు. మొత్తం మీద మాజీ సీఎం మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడం ఇప్పుడు కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి ఆరోపణలు రావడం,, పార్టీకి నష్టం కలగ చేస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి.

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.