భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

Publish Date:Mar 21, 2026

Advertisement

 

నేటి సమాజంలో చిన్నచిన్న కారణాలతో భార్యాభర్తల బంధాలు బీటలు వారుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. అయితే కొన్నిసార్లు ఆ బంధంలోని ప్రేమ, అనుబంధం ఎంత గాఢమో చూపించే ఘటన లు కూడా చోటుచేసుకుంటు న్నాయి. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి...ఒక వ్యక్తి తనకు తన భార్య మీద ఉన్న ప్రేమను చాటి చెప్పాడు...భార్య మీద ఎనలేని ప్రేమ పెంచుకు న్నాడు. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు భార్యతో సరదాగా గడిపేవాడు.. అంతలోనే భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమె లేని జీవితం వద్దను కున్నాడు. ఆమె మరణాన్ని భరించలేకపోయాడు. చివరకు తాను సూసైడ్ చేసుకుని భార్య వద్దకు చేరుకున్నాడు.. ఈ విషాదకరమైన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచే సుకుంది.

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం సీతంపేటలో నివాసముంటున్న చంద్రశేఖర్ యాదవ్ (ఎస్సై) టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తు న్నాడు. ఇతను ఈరోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నెల 17న ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ భార్య దివ్య కడుపునొప్పి తీవ్రతతో మనస్తాపానికి గురై గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. భార్య అకస్మాత్తుగా మృతి చెందడంతో చంద్రశేఖర్ యాదవ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, సహచరులు ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన మానసికంగా కుంగిపో యాడు.

భార్యపై అపారమైన ప్రేమతో జీవించిన ఆయన, ఆమె లేని జీవితం తట్టుకో లేక చివరకు అదే ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. వరుస మరణాలతో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలుగా మారారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని  మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, సహచర పోలీసులు కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు..

By
en-us Political News

  
చట్టం బలంగా ఉంటుంది. అయితే సమస్య ఏమిటంటే దాని అమలు మాత్రం అత్యంత బలహీనం. కష్టంగా ఉన్నా ఇదే చేదు నిజం. చట్టానికి, సమాజానికి మధ్య అగాధం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసేదిగా పరిణమిస్తోంది. దేశంలో చట్టాలు ఐడిలిస్టిక్ కోణంలో రూపొందుతాయి తప్ప.. రియలిస్టిక్ గా కాదు అన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది.
జగన్ తన ఫారిన్ టూర్ కోసం ఇప్పటికే ఇప్పటికే న్యాయస్థానం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ పొందిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నందున జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పని సరి అన్న సంగతి విదితమే. అది పక్కన పెడితే.. ఈ పర్యటనలో భాగంగా జగన్, ఆయన సతీమణి భారతీ లండన్ లండన్‌లో ఉంటున్న తన కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలను కలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని సమాచారం.
తప్పుడు కేసుల వల్ల తాను ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న మానసిక వేదన, ఆర్థిక నష్టం, సామాజికంగా ఎదురైన అవమానాలకు గాను రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవస్థను అడ్డం పెట్టుకుని తనను లక్ష్యంగా చేసుకున్న అధికారులు తమ సొంత జేబుల నుంచే ఈ పరిహారం చెల్లించాలన్నారు. ఇది భవిష్యత్తులో ఏ అధికారి కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తోటి అధికారులపై తప్పుడు కుట్రలు చేయకుండా గుణపాఠంగా ఉండాలని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇండియా లక్ష్యంగా సాగుతున్న కేంద్రంగా సాగుతున్న పరోక్ష ( ప్రాక్సీ) యుద్ధవ్యూహాలు దక్షిణాసియా భద్రతకు ముప్పుగా పరిణమించాయి. కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా.. దక్షిణాసియా మొత్తంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించడంలో పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు ఎల్ఈటీ, జేఈఎమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో నిందితుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కు తూటా తగిలింది.. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ధ్రువీకరించారు.
శనివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో పరుగుల సునామీ కాదు అంతకు మించి అన్నట్లుగా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఇంత వరకూ ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రెండు మ్యాచ్ లలోనూ కలిపి ఏకంగా 986 పరుగులు నమోదు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే రోజు అత్యధిక పరుగులు సాధించడం ఇదే మొదటి సారి.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను ఏ విధంగా విస్తరిస్తున్నాయో తేటతెల్లం చేస్తోంది. ముఖ్యంగా అత్యంత సురక్షితమని భావించే దేశాలలో కూడా పాక్ భూభాగం నుంచి తన కార్యకలాపాలను నిర్వహించే లష్కరే తోయిబా స్లీపర్ సెల్స్ ఏ విధంగా చొరబడుతున్నాయన్నది ఈ ఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకాన్ని బాది రికార్డు సృష్టించాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ అర్ధసెంచరీ 51 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ 218 పరుగుల భారీ స్కోరు చేసింది.
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు.
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అద్భుత ఘట్టం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది.
మెట్రో సంస్థకు కొత్త చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.