సైకో పాలన పోతుంది.. సైకిల్ పాలన వస్తుంది.. లోకేష్

Publish Date:Nov 9, 2022

Advertisement

జగన్ సర్కార్ పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన, సైకో పాలన కొనసాగుతోందనీ, అధికార పార్టీ తప్ప ఇరత పార్టీలు సభలు సమావేశాలూ జరుపువడానికి వీల్లేదన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం తీరు ఉన్నదని దుయ్యబట్టారు. అయితే ఈ పరిస్థితి మరెంతో కాలం సాగదనీ, ఏపీలో సైకో పాలన సాగుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

జగన్ హయాంలో రాష్ట్రంలో జేసీబీ రాజ్యం కొనసాగుతోందని, కూల్చివేతలు, విధ్వంసాలు వినా మరేం లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటంలో పర్యటించిన ఆయన జగన్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ రెడ్డి విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న లోకేష్ వైసీపీ ప్రభుత్వ అధికార వాహనం జేసీబీ అని విమర్శించారు. జగన్ కు నిర్మాణం గురించి అసలు తెలియదనీ, ఆయనకు తెలిసిందల్లా ఒక్క కూల్చివేత, విధ్వంసం మాత్రమేనని దుయ్యబట్టారు. సొంత నియోజకవర్గం పులివెందులలో బస్టాండ్ కూడా నిర్మించలేని జగన్ కు  కూల్చే హక్కు లేదన్నారు.  జగన్ రెడ్డి పెద్ద సైకో అయితే చిన్న సైకో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. 
 ఎక్కడైనా నాయకుడికి రోడ్లు వేస్తేనో, పేదలకు ఇళ్ళు కడితేనో, ఉద్యోగాలు ఇస్తేనో  ఆనందం వస్తుంది. 
కానీ పెద్ద సైకో.. చిన్న సైకో లకు మాత్రం విధ్వంసంతో. పేదల ఇళ్ల కూల్చివేతలో, టిడిపి నాయకుల నిర్బంధంతో ఆనందం వస్తుందని లోకేష్ అన్నారు.

 పేదల ఇళ్ళు జేసీబీతో కూల్చే వీడియోలు టివిలో చూసి ఆనందం పడే రకం ఈ పెద్ద సైకో, చిన్న సైకోలని దుయ్యబట్టారు.  ప్రజా వేదిక కూల్చడం తో మొదలైన జగన్ రెడ్డి జేసీబీ పాలన, టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు   ఇంటి గోడ , సబ్బం హరి గారి ఇంటి గోడ , గీతం యూనివర్సిటీ గోడ కూల్చివేతలతో సాగుతోందన్నారు. 

 రోడ్డు కి అడ్డంగా గోడలు కట్టడం, ప్రతిపక్ష నాయకుల పంట తగలబెట్టడం, ప్రతిపక్ష నాయకుల ఇళ్ళు కూల్చడం వీళ్లకు ఫ్యాషన్ గా మారిపోయింది.  పెద్ద సైకో జగన్ రెడ్డి మూడున్నర ఏళ్ల పాలనలో మొత్తం రాష్ట్రాన్నే కూల్చేసాడు. చిన్న సైకో ఆళ్ల రామకృష్ణా రెడ్డి మూడున్నర ఏళ్లలో మంగళగిరి ని కూల్చేసి,  
 మంగళగిరిని డిస్ట్రక్షన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
 పేదల ఇళ్ళు కూల్చడానికి ఎమ్మెల్యే ఆర్కే ఏకంగా సొంతంగా జేసీబీనే  కొన్నారన్నారు. 

 ఇప్పటం లో జరిగింది మరీ అన్యాయమనీ, కేవలం రాజకీయ కక్షతోనే ఇక్కడ ఇళ్ళు కూల్చేసారనీ, రోడ్డు మీద గుంతలు పూడ్చలేని చెత్త ప్రభుత్వం రోడ్డు విస్తరణ అంటూ ఇళ్ళు కొట్టేయడం విడ్డూరంగా ఉందన్నారు.  దేశంలోనే అత్యంత చెత్త రోడ్లు ఉన్నది ఏపీలోనే...ఒక్క గుంత పూడ్చలేదు...ఒక్క కొత్త రోడ్డు వెయ్యలేదు. కానీ ఇప్పటంలో రోడ్డు విస్తరణ చేస్తామంటూ ఇళ్ళు కూల్చేసారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ అంటే కనీసం వైసీపీ వాళ్లైనా నమ్ముతారా అని ప్రశ్నించారు.

ఇప్పటం ఒక చిన్న గ్రామం...ఊరి బయట కేవలం 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది.  కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఊరి రోడ్డుని 120 అడుగులు వెడల్పు చెయ్యడానికి కారణం కేవలం రాజకీయ కక్షసాధింపు మాత్రమేనన్నారు.  రాష్ట్రంలో ఎక్కడా లేని రోడ్డు విస్తరణ ఇప్పటంలోనే ఎందుకు అని ప్రశ్నించారు. జనసేన సభకి భూములు ఇవ్వడం తప్పా? వైసిపి తప్ప ఇతర పార్టీలు సభలు నిర్వహించుకోకూడదా? అని నిలదీశారు. జనసేన సభకి భూములు ఇచ్చారని, పోయిన ఎన్నికల్లో ఈ గ్రామంలో టిడిపి కి మెజారిటీ వచ్చిందనే కోపంతోనే ఇళ్లను కూల్చేసారని ఆరోపించారు. 
 

By
en-us Political News

  
సర్వదర్శనానికి 8 గంటల సమయం.!
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.