ఒలింపిక్స్‌కి బిహార్ లేడీ ఎమ్మెల్యే!
Publish Date:Jul 27, 2024
Advertisement
బిహార్ లేడీ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ ఒలింపిక్స్ కోసం ప్యారిస్‌కి వెళ్ళారు. ఒక ఎమ్మెల్యే ఒలింపిక్స్‌కి వెళ్తే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమిటనే సందేహం రావచ్చు.. ఈ ఎమ్మెల్యే ప్యారిస్‌కి వెళ్ళింది ఒలింపిక్స్ చూడ్డానికి కాదు.. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి. మనదేశం నుంచి ఒలింపిక్స్‌లో మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారిలో శ్రేయసి సింగ్ కూడా ఒకరు. శ్రేయసి సింగ్ షూటింగ్ క్రీడాకారిణి. అర్జున్ అవార్డు గ్రహీత కూడా. డబుల్ ట్రాప్ విభాగంలో 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని, 2018లో గోల్డ్ కోస్ట్.లో జరిగిన పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. శ్రేయసి 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో బిహార్‌లోని గిదౌర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. శ్రేయసి రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం నుంచే వచ్చారు. ఆమె తండ్రి దిగ్విజయ్ సింగ్ మాజీ ఎంపీ, తల్లి పుతుల్ సింగ్ బంకా నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ. రాజకీయ కుటుంబం అయినప్పటికీ, క్రీడల్లో కూడా శ్రేయసి రాణించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా వుండి కూడా, ఒలింపిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
http://www.teluguone.com/news/content/shreyasi-singh-olympics-25-181615.html





