తుఫాన్ బీభత్సంలోనూ వెనకడుగు వేయని విద్యుత్ సిబ్బంది.. రామ్మోహన్ నాయుడు ప్రశంసలు.!
Publish Date:Oct 28, 2026
Advertisement
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడానికి సిబ్బంది పడుతున్న శ్రమను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. తుఫాన్ సమయంలో ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో తలెత్తిన విద్యుత్ అంతరాయాలను సరిదిద్దేందుకు ఏపీఈపీడీసీఎల్ (AP EPDCL) సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించారని ఆయన పేర్కొన్నారు. భారీ ఈదురుగాలులు, ఎదరుచూడని వర్షాల కారణంగా తీగల తెగిపోవడం, విద్యుత్ స్తంబాలు నేలకూలడం వంటి ఎన్నో సవాళ్లను వారు ధైర్యంగా ఎదుర్కొన్నారని వివరించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది అంకితభావంతో పనిచేసిన తీరు అసాధారణమని రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయి కార్మికులు సమన్వయంతో పనిచేయడం వల్లే అత్యవసర సేవలను త్వరగా అందించగలిగామని తెలిపారు. విపత్తు సమయాల్లో తమ కుటుంబాలను, వ్యక్తిగత కష్టాలను పక్కన పెట్టి ప్రజా రక్షణే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల కృషి నిజంగా అభినందనీయమని ఆయన అన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగానికి జరిగిన నష్టాన్ని యుద్ధ ప్రాతిపదికన అంచనా వేసి, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవడంలో సిబ్బంది పాత్ర కీలమని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం మరియు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం అంతా అప్రమత్తమై పనిచేయడం వల్లనే పెను ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని రాజకీయ, సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇటువంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సాంకేతికతను జోడించి మరింత పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు నిరంతరం విద్యుత్ సేవలు అందేలా ప్రభుత్వం మరిన్ని శాశ్వత రక్షణ చర్యలు చేపడుతుందని ఆశించవచ్చు. [ AP EPDCL,Union Minister Rammohan Naidu,Cyclone Relief AP, APEPDCL Employees Dedication, AP Power Restoration, Cyclone Arnab, Andhra Pradesh rains, IMD weather alert, AP weather forecast ]
http://www.teluguone.com/news/content/ap-epdcl-25-235689.html





