తులం బంగారం కొంటే 12 వేలు న‌ష్ట‌పోవాల్సిందేనా

Publish Date:Mar 10, 2024

Advertisement

డ‌బ్బులు ఊరికే రావు అంటూ ఊద‌ర‌గొట్టే ప్ర‌క‌ట‌న‌ల వెనుక ఇంత మోసం ఉందా?మీరు కొన్న బంగారు ఆభరణంలో అస‌లు బంగారం ఎంత వుంది? ఆభ‌ర‌ణాలు కొనే సమయంలో మనం ఎలా నష్టపోతున్నాం? రాగిని బంగారం ధరకు బ‌హిరంగంగానే అమ్మి క‌స్ట‌మ‌ర్ జేపుకు చిల్లి పెడుతున్నారు.  షాపు వాళ్లకు ఏ విధంగా లాభాలొస్తాయి?  క‌స్ట‌మ‌ర్‌ ఎలా మోసపోతున్నాడు? 
బంగారం కొనుగోలు లో మోసాల‌పై తెలుగుఒన్ గ్రౌండ్ రిపోర్ట్‌..
బంగారం షోరూం పెట్టుకుంటే త‌క్కువ స‌మ‌యంలో కోట్లు సంపాదించుకోవ‌చ్చ‌ట‌. ఎందుకంటే బంగారం అమ్మ‌కాల్లో భారీ ఎత్తున మోసాల‌కు పాల్ప‌డుతుంటారు. అది కూడా బ‌హిరంగంగానే...
బంగారం షాపులో క‌స్ట‌మ‌ర్‌ ఎలా మోసపోతున్నాడో మీకు వివ‌రిస్తాను.
మోసం జరిగే అవకాశం డిజైన్లు, స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండే ఆభరణాల విషయంలోనే ఉంటుంది.
ఆభరణంలో అద్దిన రాళ్ల (స్టోన్స్) బరువును సైతం బంగారంగా చూపిస్తారు. 
ఎన్ని ఎక్కువ స్టోన్స్ ఉంటే అంత మోసానికి అవకాశం ఉంటుంది. 
స్టోన్స్‌తో కూడిన ఒక ఆభరణం బరువు 20 గ్రాములుంటే అందులో ఐదు గ్రాములు స్టోన్స్ ఉంటే, రాళ్ల బరువును కూడా బంగారం ధరకే లెక్క వేసే అవకాశం ఉంటుంది.
ఆ రాళ్లను బంగారంలా లెక్కించి, 
తరుగు ధర, 
మేకింగ్ ఛార్జెజ్ ఉండవని
తక్కువ తరుగు, తయారీ ధరలంటూ తగ్గించి... మార్కెటింగ్ చేసుకుంటారు. 
బంగారు ఆభరణాల్లో పొదిగే రాళ్లు ఖరీదు రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.2000 వరకు ఉంటాయి. అయినా కూడా బంగారంలో వాటిని కలిపి చూపిస్తే కస్టమర్ చాలా నష్టపోతారు. అదే తరుగు, తయారీ ఛార్జీలు లేవనే ఆఫర్లు గట్టి గాజులు, గట్టి ఉంగారాలు, డిజైన్ వర్క్ లేని బంగారు ఆభరణాల విషయంలో ఇవ్వరు. ఇవ్వలేరు.
ఈ రోజు 10 గ్రాముల ల 24 క్యారెట్ బంగారం ధర (99.9%) : ₹ 64,010 అనుకుందాం. 
వాస్తవంగా నగలు చేయడానికి 24 క్యారట్ల బంగారం ఏ మాత్రం పనికిరాదు. 
బంగారు నగలు చేయడానికి 22 క్యారట్ల బంగారాన్ని మాత్రమే వాడతారు. 
10 గ్రాముల బంగారం మనం కొంటే 
అందులో 1 గ్రాము రాగి +9 గ్రాముల బంగారం ఉంటుందనే సంగతి చాలా మందికి తెలుసు. 
22 కారట్ 10 గ్రాముల బంగారు ధర :₹ 58633 మాత్రమే ఉంది.
24 కారట్ మరియు 22 కారట్ గోల్డ్ మధ్య వత్యాసం :₹ 5,377.00 వరకు ఉంది కదా…? 
పది గ్రాముల బంగారు నగ మనం కొంటే 
తరుగు కింద 10 నుంచి 15 శాతం వరకు కట్ చేస్తారు. ఆంటిక్ నగలకైతే 22–24% వరకు కూడా ఉంటుంది. 
ఈ సొమ్ము మొత్తం మన జేబులో నుంచే. 
నిజానికి ఎంత మంచి బంగారు నగ తయారు చేసినా సరే 5 శాతం మించి పోయే అవకాశం ఉండదు. 
ఆ లెక్కన 10 గ్రాముల బంగారు నగ ధర: 58,633 + 10%,… టోటల్ 58,633 + 5,863 = 64,496/- (ఇది 22 కార‌ట్ 10 గ్రాముల బంగారు న‌గ ధ‌ర‌).
22 కారట్ 10 గ్రాముల బంగారు నగ వెలకి, 
24 కారట్ రాగి కలపని స్వచ్ఛమైన బంగారానికి తేడా పెద్ద‌గా ఏం ఉండదు. 
పది గ్రాముల బంగారు నగ మనం కొంటే వచ్చేది కేవలం 8.8 గ్రాముల బంగారమే. 
ఈ విషయం చాలా మందికి తెలియదు. 
అంటే ₹ 64,496/- పెట్టి కొన్న నగ నిజమైన విలువ ₹ 58,633/- మాత్రమే అనే విషయం చాలా మందికి తెలియదు. 
మనకు అమ్మిన వాడి ₹ 5,863 లాభం ఉంటుంది. 
ఇవన్నీ కాకుండా మేకింగ్ కాస్త అని చెప్పి 
గ్రాము బంగారానికి ₹ 150 నుంచి ₹ 200 వరకు మన జేబులో నుంచే వెళ్తుంది. 
పది గ్రాముల బంగారం కొంటే ₹ 1500 – ₹ 2000 రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. 
బంగారం కొనుగోలు లో మోసపోతున్న  వినియోగదారులు.
రాగిని బంగారం ధరకు కొని ఎంత  నష్టపోతున్నారో తెలుసా...?
బంగారు గొలుసు తయారుచేయడానికి రాగిని జోడించడం ద్వారా మాత్రమే ఆభరణాలు తయారు చేయబడతాయి ఈ విషయం వినియోగదారుల ముఖ్యంగా తెలుసుకోవాలి....!  
ఉదాహరణకు 10 గ్రాముల బంగారు గొలుసు తయారు చేయడానికి 
1 గ్రాము రాగి మరియు 9 గ్రాముల బంగారాన్ని జోడించి బంగారు 
ఆభరణాలను తయారు చేస్తారు. 
కానీ ఒక సాధారణ మనిషి బంగారం కొనేటప్పుడు, 
9 గ్రా. బంగారం + 1 గ్రాము రాగి కలిపి బిల్లులో 10 గ్రాముల బంగారంగా అమ్ముతారు. 
దానికి తోడు, 
వారు రాగిని బంగారం ధరకు అమ్ముతున్నారు, 
1 గ్రాము బంగారం వృధాగా తరుగుగా చూపిస్తున్నారు.
దీనిలో 9గ్రా బంగారం + 1గ్రా. రాగి (బంగారంగా) + నష్టం (తరుగు) 1 = 11 గ్రాములు. 
కాబట్టి 10 గ్రాముల ఆభరణాల కొనుగోలుదారులు 
9 గ్రాముల బంగారాన్ని మాత్రమే కాకుండా 
2 గ్రాముల రాగిని కూడా బంగారంగా జోడించి బంగారం ధరను వసూలు చేస్తారు ..
కాబట్టి మనం 10గ్రా గ్రాముల ఆభరణాలకు 11 గ్రాముల బంగారం ధరను చెల్లిస్తాము. 
వారు ఎవరిని మోసం చేస్తున్నారు!  వారు పేదలను మోసం చేస్తున్నారు.  మరియు పరాన్నజీవులై పేదల రక్తాన్ని పీలుస్తున్నారు.  ఒక కొత్త ఆభరణాల దుకాణాన్ని తెరిచి, కొన్నేళ్ల వ్యవధిలో బహుళ భవనాలు, అంతస్తులు నిర్మించి, కొనుగోలు చేస్తే డబ్బు వారికి ఎలా వచ్చింది? పై లెక్కలు అంత గొప్పగా మారడానికి సరైనవని అంగీకరిస్తున్నారు. 
ఇది నిజం కాదా ఈ రోజు ఒక గ్రాము బంగారం ధర ఎంత? 
24 క్కారెట్ గోల్డ్ ని అభారణాలుగా మార్చడానికి 2 గ్రాముల బంగారం వసూలు చేస్తున్నప్పుడు ఒక గ్రాము రాగి ధర ఎంత? 
ఉదాహరణ కు ఈ క్రింది ఖాతాను తనిఖీ చేయండి ...! 
1 గ్రాము బంగారం విలువ 
రూ. 6,401 / - 
10 గ్రాముల బంగారం విలువ
రూ. 64,010 / - 
1 గ్రాముల రాగి - రూ. 10/- 
9 గ్రాముల  బంగారం ధర 
రూ. 57,609/- 
9 గ్రాముల బంగారం + 
1 గ్రాము రాగి - 
రూ.  57,609/- + 10= 57,619/-
10గ్రా. బంగారంలో - 
రూ.64,010 - రూ 57,619/-
లాభం = రూ. 6,391/- 
వ్యర్థం 1గ్రా= రూ.6,401/ - 
10గ్రా ఆభరణానికి రూ.12,792/-కు స్థూల లాభం 
ప్రజలు ఈ అవగాహన వుంటే బంగారం ధర ఖచ్చితంగా తగ్గుతుంది ...  
సూచన:
కేవలం ఇది 10% తరుగు ఆధారంగా లెక్కించబడినది.
15%నుండి 20% తరుగు తీసుకునే షాపులు కూడా ఉన్నాయి.(వాస్తవంగా ఎంత మంచి డిజైన్ ఉన్న ఆభరణం ఐనా 5%వరకు మాత్రమే తరుగు పోతుంది).
22 కేడీఎం హాల్‌మార్క్ ఉంగరం పది గ్రాములు, 
అంటే 22కే పది గ్రాముల బంగారం ఖరీదు రూ. 58,633 వేలు అనుకుందాం. 
ఈ ఉంగ‌రం తయారు చేయడానికి  2 వేల 300 రూపాయ‌ల‌ విలువైన బంగారం ఖర్చవుతుంది. అంటే తయారీదారు 400 మిల్లీ గ్రాముల బంగారాన్ని తీసుకుంటారు.
వస్తువు తయారీలో హ్యాండ్ అండ్ మిషన్ వర్క్ చేసేటప్పుడు 
దాదాపు 200 మిల్లీ గ్రాములు పోతుంది. 
మిగిలిన 200 మిల్లీ గ్రాములు మజూరీ లేదా తయారీకి తీసుకుంటారు. తయారీదారు వస్తువుగా చేసి కస్టమరు ఇచ్చే 
ఆభరణంలో 9.6 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. 
దీని విలువ రూ. 56,333/-. కానీ ఆ ఆభరణం బరువు మాత్రం 10.44 గ్రాములుంటుంది.
అంటే 10 గ్రాముల బంగారం ఇస్తే 10.44 గ్రాముల బరువైన ఆభరణం వస్తుంది. 
అందులో 96 శాతం బంగారం ఉంటే, 8.4 శాతం ఇతర లోహాలుంటాయి.
 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.