పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

Publish Date:Jun 13, 2026

Advertisement

ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ, టీ లు పేపర్ కప్పులలో తాగుతుంటారు.  దుకాణ దారులు కూడా పేపర్ కప్పులు ఉపయోగిస్తారు.  ఎక్కడో చాలా కొద్దిమంది మాత్రమే స్టీల్ లేదా గాజు గ్లాసులు ఉపయోగిస్తారు. ఉద్యోగం నిమిత్తం బయట ఉండేవారు లేదా రోజూ అలా వాకింగ్ కు వెళ్లి వస్తూ బయట టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా గల వారు రోజూ పేపర్ కప్పులో తాగడం జరుగుతుంది.  ఎప్పుడో ఒకసారి ఇలా పేపర్ కప్పులో తాగితే పర్లేదు.. కానీ. రోజూ పేపర్ కప్పులలో కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబున్నారు. పేపర్ కప్పులు ఆరోగ్యానికి కూడా మంచివని అనుకుంటారు, పైగా పర్యావరణానికి కూడా హాని కలిగించవు అనుకుంటారు. కానీ పేపర్ కప్పులను టీ, కాఫీ తాగడానికి ఉపయోగించడం గురించి చాలా షాకింగ్ నిజాలు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.  దాని గురించి తెలుసుకుంటే..

పేపర్ కప్పులలో కాఫీ, టీ తాగడం వల్ల కలిగే నష్టాలు..

మైక్రోప్లాస్టిక్..

చాలా కాగితపు కప్పుల లోపల పాలిథిలిన్ లేదా ప్లాస్టిక్  పలుచని పొర ఉంటుంది.  దీనిలో వేడి టీ పోసినప్పుడు, మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదలై పానీయంలో కలిసిపోతాయి, ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

రసాయనాలు..

కొన్ని కాగితపు కప్పుల పూతలో ఉండే రసాయనాలు, అధిక వేడికి గురైనప్పుడు పానీయంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. పేపర్ కప్పులలో కాఫీ, టీ  ఎక్కువ కాలం పాటు తాగడం  వల్ల ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చని వైద్యులు  చెబుతున్నారు.

హార్మోన్ల అసమతుల్యత..

ప్లాస్టిక్ ఆధారిత కొన్ని రసాయనాలు శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను ప్రభావితం చేయగలవని నిపుణులు భావిస్తున్నారు. పేపర్  కప్పులను పదేపదే ఉపయోగించడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అంటున్నారు.

పర్యావరణం..

కాగితపు కప్పులు అని పిలిచినప్పటికీ, వాటిలో ఉండే ప్లాస్టిక్ పూత కారణంగా వాటిని పూర్తిగా రిసైకిల్  చేయడం కష్టమట. దీనివల్ల పర్యావరణ కాలుష్య సమస్య పెరగవచ్చట.

కాఫీ, టీ  ఎలా తాగితే సురక్షితం..

టీ తాగడానికి స్టీల్, గాజు లేదా మట్టి కప్పులను వాడాలి.

కాగితపు కప్పులలో వేడి పానీయాలను పదేపదే తాగడం మానుకోవాలి. కాగితపు కప్పులను ఉపయోగిస్తుంటే, క్వాలిటీ  కప్పులను మాత్రమే ఎంచుకోవాలి.  వేడి పానీయాలను కప్పులో ఎక్కువ సేపు ఉంచడం కూడా మంచిది కాదు. కాబట్టి తొందరగా తాగాలి.

                                      *రూపశ్రీ.

By
en-us Political News

  
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు...
స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి... వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం ఏమిటి.. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు, బ్రేక్‌ఫాస్ట్ ప్రాముఖ్యత, టిఫిన్‌లో పెట్టాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. పి. జానకి శ్రీనాథ్ వివరించిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి...
కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా..
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.