వైసీపీకి షాక్?..ఏంపీలు గోడ దూకేస్తున్నారా?

Publish Date:Aug 3, 2024

Advertisement

వైసీపీకి త్వరలో ఆ పార్టీ ఎంపీలు ఝలక్ ఇవ్వనున్నారా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. రానున్న రోజులలో జగన్ కు భారీ షాక్ తప్పదని అంటున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. మెజారిటీ రాజ్యసభ సభ్యులు   పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో అవసరమైన బలంలేరు. కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులు రాజ్యసభ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే బయట నుంచి మద్దతు అవసరం. అయితే అలా బయట నుంచి మద్దతు తీసుకోవడం కంటే.. ఎంపీలను పార్టీలో చేర్చుకోవడమే మేలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో జగన్ తీరుతో తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న పలువురు వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లోకి వెళ్లారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

అయితే వారు బీజేపీలోకి టచ్ లోకి వెళ్లింది, ఆ పార్టీలో చేరడానికి కాదు, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా చేరేందుకు వారు బీజేపీ సహాయం కోరుతున్నారు.  వైసీపీ అధినేత జగన్ తన వైఖరి మార్చకోక, అహంకారంతో వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీలో ఎంపీలు ఇమడ లేకపోతున్నారు.  అన్నిటికీ మించి రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్వానం అంటూ జగన్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ధర్నా అట్టర్ ప్లాప్ కావడం,  గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా నాయకులు దోచుకున్నట్లు రోజుకోక కుంభకోణం బయటపడుతుండటంతో వైసీపీ నేతలలో భయం ఏర్పడంది. అన్నిటికీ మించి ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కేవలం జగన్ అన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా వైసీపీతో, జగన్ తో అంటకాగితే రాజకీయ జీవితం సమాధి కావడం తప్ప మరో ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. దీంతో వారు పార్టీకి దూరం జరుగుతున్నారు.

బీజేపీలో చేరడం కంటే.. తప్పులు ఒప్పుకుని చెంపలేసుకుని తెలుగుదేశం గూటికి చేరడమే మేలని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. అయితే నేరుగా తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వెళ్లేందుకు దారులన్నీ మూసుకుపోవడంతో.. బీజేపీ ద్వారా తెలుగుదేశంకు దగ్గర కావాలన్న ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. అయితే   ఎంత మంది వైసీపీ ఎంపీలు పార్టీ మారతారన్న కచ్చితమైన సమాచారం లేదు. విశ్వసనీయ వర్గాలు, వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కనీసం ఐదుగురు ఎంపీలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది.   ఏదిఏమైనా ఐదారుగురు ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని అంటున్నారు.  

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.