కావూరి, కోటగిరికి షాక్ ఇచ్చిన కరాటం రాంబాబు
Publish Date:May 3, 2012
Advertisement
ఒకరు సీనియర్ పార్లమెంటేరియన్, మరొకరు రాజేకీయదురంధరుడు, మాజీమంత్రి. పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వీరిద్దరూ కీలకమైన శక్తులుగా ఉన్నారు. ఒకరు కావూరి సాంబశివరావు కాగా, మరొకరు మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు. ఈ ఇద్దరు నాయకులకు అదే జిల్లాకు చెందిన డిసిసిబి చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు అయిన కరాటం రాంబాబు షాక్ ఇచ్చారు. తాను తెరపైకి తెచ్చిన బొజ్జిదొరకు పోలవరం కాంగ్రెస్ టిక్కెట్టు ఇప్పించుకోవటంలో ఆయన సఫలమయ్యారు. మాజీ ఎమ్మెల్యే బాడిస దుర్గారావు కుమారుడైన బాడిస బొజ్జిదొర అభ్యర్థిత్వాన్ని కావూరి, కోటగిరి తీవ్రంగా వ్యతిరేకించారు. బొజ్జిదొరకు బదులుగా నుపా పార్వతి, దుర్గ, కుంచా పార్వతి పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి సూచించారు. అయితే కరాటం రాంబాబు వీరి ప్రయత్నాలకు అడ్డుకట్టవేసి జిల్లామంత్రి, పోలవరం పార్టీ ఇన్ ఛార్జి అయిన వట్టి వసంత్ కుమార్ మద్దతుతో బొజ్జిదొర పేరు ఖరారు చేయించి కావూరి, కోటగిరిలకు షాక్ ఇచ్చారు. తమ అభిష్ట్రానికి వ్యతిరేకంగా టిక్కెట్టు తెచ్చుకున్న బొజ్జిదొరకు ఈ సీనియర్ నాయకులు ఎంతవరకూ సహకరిస్తారన్న అంశంపై సందేహాలు వెలువడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/shock-given-to-kavuri-sambashivarao-and-kotagiri-vidhyadhara-rao-by-dccb-chairman---karatam-rambabu-24-13803.html





