షిండే షాక్ ... రాజకీయ బాధితులతో కేటీఆర్ రాజీ యత్నాలు ?

Publish Date:Jul 12, 2022

Advertisement

అనుభవం అయితేనే గానీ, తత్త్వం బోధపడదంటారు. నిజం. రాజకీయాలలో ఉన్నవారికి, ముఖ్యంగా, చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బాపతు రాజకీయ నాయకులలో  అహంకారం అనేది, అలా అతుక్కుని ఉంటుంది. రాహుల్ గాంధీ నుంచి   కేటీఆర్ వరకు, చాలా మందిలో ఆ అవలక్షణం, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో, బయటపడుతూనే ఉంటుంది. కనిపిస్తూనే ఉంటుంది. 

ఒకప్పడు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో  రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన ఆర్డినెన్సు కాపీని విలేకరుల సమావేశంలో, చించి పోగులు పెట్టారు. అహంకారాన్ని ప్రదర్శించారు. అది కూడా, ప్రధాని విదేశాల్లో ఉన్న సమయంలో గాంధీ  నెహ్రుల వారసుడు  రాహుల్ గాంధీ ప్రధానిని, మొత్తం మంత్రివర్గాన్ని,చివరాఖరకు ఆర్డినెన్సుకు మోద ముద్ర వేసిన అప్పటి రాష్ట్రపతిని  అవమాన పరిచే విధంగా, తమ అహంకారాన్ని  ప్రదర్శించారు. 

నిజమే, న్యాయస్థానాలలో శిక్ష పడిన ప్రజాప్రతి నిధులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సు, రాహుల్  గాంధీ అన్నట్లుగానే ఒక పనికి మాలిన ఆర్డినెన్సు, ఆయినా, అధికార కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్న ఆయన తమ అభిప్రాయాన్ని, నేరుగా ప్రభుత్వానికి వివరించే అవకాశం ఉన్నా, విలేకరుల సమావేశంలో ఆర్డినెన్సు పత్రాలు చించేసి, ఇదంతా పనికిమాలిన  చెత్తని  విమర్శలు చేయడం ఆయన  అహంకారానికి నిదర్శనంగానే నిలిచింది. అలాగే, రాహుల్ గాంధీ, నిర్లక్ష్య ధోరణి  కారణంగానే అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ సహా అనేక మంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో,ఇతర పార్టీలలో చేరారు. 

ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే కాదు, ప్రాంతీయ, కుటుంబ పార్టీల పుత్ర రత్నాలు చాలా మందిలో ఈ దురహంకార ధోరణి కనిపిస్తుంది, నిన్నగాక మొన్న, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్న శివసేన అధినేత  ఉద్ధవ్ థాకరే పతనానానికి, పార్టీలో తిరుగుబాటుకు ఇంకా అనేక కారాణాలు ఉన్నా ఆయన ముఖ్యమంత్రిగా ప్రదర్శించిన అహంకార ధోరణి కూడాడా ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొన్నారు. 

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఅర్ విషయం అయితే చెప్పనక్కరలేదని పార్టీ నాయకులే చెపుతారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ లోనూ దొరతనం అహంకార లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అదేమీ రహస్యం కాదు. ఇక కేటీఆర్ అయితే, ముందు అహంకారం పుట్టి తర్వాత ఆయన పుట్టారని అంటారు. అయితే ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి, కొంత కాలం క్రితం వరకు, కేటీఆర్ కొంత హుందాగానే వ్యవహరించారు. కానీ, ఎందుకో ఏమో కానీ, ఈ మధ్య  కాలంలో కేసీఆర్ నోట్లోనుంచి ఊడి పడ్డారా, అన్నట్లుగా మాటకు పదును పెట్టారు.భాష విషయంలో కేసీఆర్ ని మించిపోయారు. 

అలాగే  అంతకు ముందునుంచే పార్టీపై పట్టు పెంచుకునే క్రమమలో ఆయన, కొందరు సీనియర్ నాయకులను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారు. అందులో కొందరు, పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే, ఇప్పడు మళ్ళీ కేటీఆర్ దూరమైన వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా, మహారాష్ట్ర పరిణామాలు, ఆ వెంటనే, బీజేపీ ఇతర పార్టీల నుంచి సీనియర్ నాయకులను ఆకర్షించేందుకు ఏకంగా, ఒక కమిటీనే వేసింది. అంతే కాదు కమిటీ సారథ్య బాధ్యతలను ఇంచుమించుగా 20 ఏళ్ళు కేసీఆర్ వెంట ఉన్న,  మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు, తెరాస మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి అప్పగించింది.

అందుకే  కేటీఆర్ గతంలో తన్ని తగలేసిన నాయకులతో ఇప్పడు సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. గతంలో అలాంటి కేటీఆర్ బాధిత నేతలు ఎక్కడైనా అనుకోకుండా తారస పడినా  కేటీఆర్ మొహం తిప్పుకుని వెళ్లి పోయేవారు, ఇప్పడు వారు మొహం తిప్పుకున్నా తానే వెళ్లి పలకరిస్తున్నారు.పార్టీ వ్యవహారాల్లో తన మాట వినకుండా దూరంగా ఉన్న వారిని.. పార్టీ వీడి పోయిన వారిని కూడా ఇప్పుడు ఆయన ఫ్రెండ్లీగా పలకరిస్తున్నారు. ఇటీవల పార్టీలో  రెబెల్ టోన్ వినిపిస్తున్న,కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లి మరీ పలకరించారు. అంతకు ముందు, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తెరాస తీర్థం పుచ్చుకున్న  నేపధ్యంలో  అదే జూపల్లిని కేటీఆర్ చులకనగా చూశారు. ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్న సమయంలో  ఇటికి వెళ్లి రాజకీయాలు చర్చించారు.

అలాగే, తాజాగా ఒక కార్యక్రమమలో తారస పడిన, మాజీ ఎంపీ వివేక్ ను కేటీఆర్   ఆత్మీయంగా పలకరించారు. పక్కకు తీసుకుపోయి మరీ ముచ్చట్లు పెట్టారు. అయితే కేటీఆర్ కారణంగానే వివేక్ తెరాసను వదిలి బీజేపీలో చేరారు. వివేక్ సిట్టింగ్ సీటు పెద్ద పల్లి టిక్కెట్‌ను ఆయనకు కాదని, తమ అనుచరుడు బాల్క సుమన్ కు ఇవ్వడంతో వివేక్ తెరాస వదిలి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఈటల సారథ్యంలోని, చేరికల కమిటీలో సభ్యుడిగా,చురుగ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయనతో కేటీఆర్ ముచ్చట్లు పెట్టడం వెనక ఎలాంటి వ్యూహం ఉందనేది పక్కన పెడితే, తండ్రీ కొడుకులు ఇద్దరికీ షిండే షాక్ గట్టిగానే తగిలిందని, రాజకీయవర్గాలు భావిస్తున్నాయి

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.