బోనాల జాతరలో ‘షీ’ కన్ను.. 678 మందికి షాక్.. 25 మందికి జైలు..!

Publish Date:Aug 6, 2026

Advertisement

 

హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్‌ చెక్ పెట్టాయి. పోలీసులే కనిపించడం లేదని ధీమాగా వ్యవహరించిన వారికి.. తమ మధ్యలోనే మఫ్టీలో షీ టీమ్స్‌ ఉన్నాయన్న విషయం ఆలస్యంగా తెలిసింది. అప్పటికే వారి చేష్టలు కెమెరాల్లో రికార్డయ్యాయి. బోనాల సందర్భంగా మహిళలను వేధిస్తూ ఆకతాయితనా నికి పాల్పడిన 678 మందిని షీ టీమ్స్‌ గుర్తించాయి. 

జనసం దోహంలో మహిళలను వెంబడించడం, అసభ్యం గా ప్రవర్తించడం, ఇబ్బం దులకు గురిచేయడం వంటి ఘటనలను షీ టీమ్స్‌ సిబ్బంది మఫ్టీలో నిశితంగా గమనించారు. అనుమానం వచ్చిన వెంటనే వీడియో ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకున్నారు. షీ టీమ్స్‌ సేకరించిన వీడియో ఆధారాలతో పలువురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆకతాయిలకు కోర్టు శిక్షలు విధించింది. 

25 మందికి జైలుశిక్షతో పాటు జరిమానాలు పడగా.. మరో 11 మందికి మూడు రోజుల జైలు, రూ.1,050 జరిమానా విధించారు. ఇక 26 మందికి రూ.1,050 చొప్పున జరిమానా విధించడంతో పాటు సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. పండుగ వేళ మహిళలకు భద్రత కల్పించేందుకు షీ టీమ్స్‌ ప్రత్యేక నిఘా కొనసాగి స్తున్నాయి. మఫ్టీలో ఉండటంతో తమను ఎవరూ గుర్తించలేరన్న ధీమాతో ఆకతాయిలు చేసే ప్రతి కదలికను గమనిస్తున్నాయి. బోనాల జాతరలో భక్తి ముసుగులో ఆకతాయి తనం చేస్తే.. ‘షీ’ టీమ్స్‌ కెమెరా కంటికి చిక్కాల్సిందే.. కోర్టు మెట్లెక్కాల్సిందే..!

Shes eye at the Bonala Jathara, She Teams, CM Revanth reddy, Telangana police, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand

By
en-us Political News

  
ప్రభుత్వ పాఠశాలలో విషసర్పం కాటుకు ఎనిమిదేళ్ల విద్యార్థి బలి..!
హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా మరో కీలక అడుగు వేస్తోంది
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ బతికున్న సమయంలో ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన జూనియర్‌ కాలేజీలు.. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ ముందు, కాలిపోయే ఎండలో, రోడ్డు పక్కన ప్లాట్‌ఫారమ్‌పై కట్టుకున్న పెళ్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయకుల దర్శనం కోసం దేహి అని వేడుకుంటున్న
తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ఐసీయూలో చావుబతుకుల మధ్య వైద్య విద్యార్థిని..!
నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు
చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన అమర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.