హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్ చెక్ పెట్టాయి. పోలీసులే కనిపించడం లేదని ధీమాగా వ్యవహరించిన వారికి.. తమ మధ్యలోనే మఫ్టీలో షీ టీమ్స్ ఉన్నాయన్న విషయం ఆలస్యంగా తెలిసింది. అప్పటికే వారి చేష్టలు కెమెరాల్లో రికార్డయ్యాయి. బోనాల సందర్భంగా మహిళలను వేధిస్తూ ఆకతాయితనా నికి పాల్పడిన 678 మందిని షీ టీమ్స్ గుర్తించాయి.
జనసం దోహంలో మహిళలను వెంబడించడం, అసభ్యం గా ప్రవర్తించడం, ఇబ్బం దులకు గురిచేయడం వంటి ఘటనలను షీ టీమ్స్ సిబ్బంది మఫ్టీలో నిశితంగా గమనించారు. అనుమానం వచ్చిన వెంటనే వీడియో ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకున్నారు. షీ టీమ్స్ సేకరించిన వీడియో ఆధారాలతో పలువురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆకతాయిలకు కోర్టు శిక్షలు విధించింది.
25 మందికి జైలుశిక్షతో పాటు జరిమానాలు పడగా.. మరో 11 మందికి మూడు రోజుల జైలు, రూ.1,050 జరిమానా విధించారు. ఇక 26 మందికి రూ.1,050 చొప్పున జరిమానా విధించడంతో పాటు సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. పండుగ వేళ మహిళలకు భద్రత కల్పించేందుకు షీ టీమ్స్ ప్రత్యేక నిఘా కొనసాగి స్తున్నాయి. మఫ్టీలో ఉండటంతో తమను ఎవరూ గుర్తించలేరన్న ధీమాతో ఆకతాయిలు చేసే ప్రతి కదలికను గమనిస్తున్నాయి. బోనాల జాతరలో భక్తి ముసుగులో ఆకతాయి తనం చేస్తే.. ‘షీ’ టీమ్స్ కెమెరా కంటికి చిక్కాల్సిందే.. కోర్టు మెట్లెక్కాల్సిందే..!
Shes eye at the Bonala Jathara, She Teams, CM Revanth reddy, Telangana police, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shes-eye-at-the-bonala-jathara-36-228178.html
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!
మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల....
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు