నీట్ నిరసనల వేళ శశి థరూర్ రీపోస్ట్.. బాలీవుడ్ మౌనంపై ఊపందుకున్న చర్చ!

Publish Date:Jul 23, 2026

Advertisement

దేశవ్యాప్తంగా నీట్  లీకేజీ వ్యవహారం దుమారం రేపుతున్న వేళ.. తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, నిర్బంధం వంటి అణచివేత చర్యలకు పాల్పడటం వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,  ఎంపీ శశి థరూర్  సామాజిక మాధ్యమం  వేదికగా చేసిన  రీపోస్ట్ ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది.

శశి థరూర్ తన  ఎక్స్  ఖాతాలో ఎలాంటి అదనపు వ్యాఖ్యలు జోడించకుండా..  2012లో   బాలీవుడ్ దిగ్గజ నటుడ, బిగ్ బి  అమితాబ్ బచ్చన్ చేసిన   ట్వీట్ ను రీట్వీట్ చేశారు.  2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన  సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియా గేట్, రైసినా హిల్ వద్ద ప్రజలు, యువత ఆందోళన చేపట్టిన సమయంలో ఆందోళనకారులపై పోలీసులు   భాష్పవాయు  ప్రయోగం, వాటర్ క్యానన్ల చర్యలపై బిగ్ బీ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే   బాధగా,దిగ్భ్రాంతిగా ఉంది.. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై భాష్పవాయు గోళాలు, వాటర్ క్యానన్లను ఉపయోగిస్తున్నారు  అంటూ  అమితాబ్ బచ్చన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  

ఇప్పుడు శశిథరూర్ అప్పట్లో  అమితాబ్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. శశిథరూర్ చర్య వెనుక స్పష్టమైన  సందేశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2012లో ప్రభుత్వ చర్యలను నిలదీస్తూ గళమెత్తిన బాలీవుడ్ అగ్ర నటులు, ఈ రోజు నీట్ విద్యార్థులపై పోలీసుల దమనకాండ విషయంలో మౌనంగా ఉండటాన్ని శశిథరూర్ నాటి అమితాబ్ ట్వీట్ ను తిరిగి పోస్టు చేయడం ద్వారా నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నించారని అంటున్నారు.  బాలీవుడ్ అగ్రనటుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారని చెబుతున్నారు. 

అయితే నీట్ లీకేజీకి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలపై  బాలీవుడ్ పరిశ్రమ మొత్తం మౌనంగా అయితే లేదు.  కొద్దిమంది సినీ ప్రముఖులు  విద్యార్థుల పక్షాన నిలబడ్డారు.  శబానా అజ్మీ, ప్రకాష్ రాజ్, స్వర భాస్కర్ వంటి వారు స్వయంగా  జంతర్ మంతర్ వద్దకు వెళ్లి మరీ విద్యార్థులకూ, వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. అలాగే..  హుమా ఖురేషి, నసీరుద్దీన్ షా, సోనాక్షి సిన్హా, అభయ్ డియోల్ వంటి వారు సామాజిక మాధ్యమం వేదికగా  విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.   ప్రీతి జింటా, భూమి పెడ్నేకర్ వంటి నటీమణులు హింసకు తావులేకుండా, విద్యార్థుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపైనే పాలకులు దృష్టి పెట్టాలని బహిరంగంగా కేంద్రానికి విజ్ణప్తి చేశారు. 

అయితే ఇక్కడ శశిథరూర్  పోస్టు .. గతంలో సామాజిక అంశాలపై గళమెత్తిన బాలీవుడ్ పెద్దలు నేడు ఎందుకు సైలంటైపోయారన్న చర్చను లేవనెత్తింది. 2012 నాటి అమితాబ్ స్పందన, ప్రస్తుత నీట్ నిరసనలపై అమితాబ్ వంటి  అగ్ర తారల మౌనం వెనుక ఉన్న కారణమేంటన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. 

Shashi Tharoor repost, NEET protests Delhi, Amitabh Bachchan 2012 tweet, Bollywood silence on NEET, NEET paper leak news, Jantar Mantar protests

By
en-us Political News

  
లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది.
విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన ఈ భూములు మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లు నిర్వహించడంలో రా ఎన్టీఆర్ తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. ఇన్నాళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న రా ఎన్టీఆర్ హఠాత్తుగా సేవలను నిలిపివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.
ధవళేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ.. అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌కు చేరిన ప్రయాణం ప్రతీ చిన్నారికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.
లోహియా కార్ప్ ఐపీఓ ప్రారంభమైంది. రూ. 404 425 ధరల శ్రేణి, 8.47% జిఎంపి లాభాలు, ఆఫర్ ఫర్ సేల్ వివరాలు, కేటాయింపు డేట్లు మరియు బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
హ్యుందాయ్ కార్ల ఫ్యాక్టరీలో బోస్టన్ డైనమిక్స్ అట్లాస్ హ్యూమనాయిడ్ రోబోల ప్రవేశానికి వ్యతిరేకంగా 39,000 మంది కార్మికులు చేపట్టిన చారిత్రాత్మక సమ్మె, రూ. 1,000 కోట్లకు పైగా ఉత్పత్తి నష్టం మరియు AI రోబోటిక్స్ యుగంలో ఉద్యోగ భద్రత గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అమెరికాలోని ఇర్మో పట్టణంలో పోలీసు అధికారుల కంటే ఎక్కువగా ఏఐ నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫ్లాక్ కెమెరాల డేటా భద్రత, సైబర్ లోపాలు మరియు పౌర హక్కుల ఉల్లంఘనపై ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మీకోసం.
జెన్ జీ ఉద్యోగులు ఆఫీస్ కంటే వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఎక్కువ ఉత్పాదకత సాధిస్తున్నారని యూగోవ్ సర్వే తెలిపింది. ఆఫీస్ డిస్ట్రాక్షన్స్, వర్క్ సంస్కృతి మరియు ఉత్పాదకతపై 53 శాతం మంది వెల్లడించిన కీలక నిజాలు ఇక్కడ చదవండి.
పవిత్రమైన వివాహబంధం మొగుడూ పెళ్లాల మధ్య అనురాగం, ఆప్యాయత, ప్రేమలతో ముడి పడి ఉంటే పరిస్థితి నుంచి పరస్పరం కక్షలూ కార్పణ్యాలతో బద్ధ శత్రువులుగా మారే పరిస్థితి ఉత్పన్నమౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.