Publish Date:Aug 22, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే కూటమి అభ్యర్థిని ప్రకటించిన తరువాత సుదీర్ఘ చర్చల అనంతరం ఎన్డీయే కూటమి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. దీంతో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోటీ అనివార్యమైంది. ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉప రాష్ట్రపతి ఎన్నిక రాజకీయాన్ని రసకందాయంలో పడేలా చేసింది. ఇండియా కూటమి అభ్యర్థి తెలుగువారవ్వడం, ఇంత వరకూ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి కావడంతో.. పోవడంతో ఏ కూటమిలోనూ లేకపోయినా జగన్ నాయకత్వంలోని వైసీపీ ఆయనకు కాకుండా, ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.
మిగిలిన వారందని విమర్శలూ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల విమర్శలు మాత్రం జగన్ నోట మాట రానీయకుండా చేస్తున్నాయి. తన సోదరుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ ప్రధాని మోడీకి దత్తపుత్రుడంటూ ఆమె మరో సారి జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ పరిస్థితులు, పరిణామాలతో సంబంధం లేకుండా జగన్ ఎన్డీయే అభ్యర్థికి బేషరతు మద్దతు ఇవ్వడాన్ని సూటిగా ప్రశ్నించిన షర్మిల.. తెలుగుదేశం, జనసేన, జగన్ ఒకే తానులోని ముక్కలని విమర్శించారు.
అయితే తెలుగుదేశం, జనసేనలు బీజేపీతో తమ బంధాన్ని బహిరంగంగా చెబుతుంటే.. జగన్ మాత్రం రహస్యంగా బీజేపీ పంచన చేరి ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటున్నారని విమర్శించారు. ఇంత కంటే దారుణం మరోటి ఉండదన్నారు. ఇండియా కూటమి తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిల బెట్టినా, జగన్ నిస్సిగ్గుగా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని బట్టే వైసీపీ బీజేపీ బీటీం అని అర్ధ మౌతోందని షర్మిల అన్నారు. వైసీపీ రాష్ట్రప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. చూడాలి షర్మిల విమర్శలకు జగన్ ఏ రకంగా స్పందిస్తారో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sharmila-strong-criticism-on-jagan-25-204786.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.