మోడీ దత్తపుత్రుడు జగన్.. వైసీపీ బీజేపీ బీటీమ్!
Publish Date:Aug 22, 2025
Advertisement
ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే కూటమి అభ్యర్థిని ప్రకటించిన తరువాత సుదీర్ఘ చర్చల అనంతరం ఎన్డీయే కూటమి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. దీంతో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోటీ అనివార్యమైంది. ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉప రాష్ట్రపతి ఎన్నిక రాజకీయాన్ని రసకందాయంలో పడేలా చేసింది. ఇండియా కూటమి అభ్యర్థి తెలుగువారవ్వడం, ఇంత వరకూ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి కావడంతో.. పోవడంతో ఏ కూటమిలోనూ లేకపోయినా జగన్ నాయకత్వంలోని వైసీపీ ఆయనకు కాకుండా, ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. మిగిలిన వారందని విమర్శలూ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల విమర్శలు మాత్రం జగన్ నోట మాట రానీయకుండా చేస్తున్నాయి. తన సోదరుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ ప్రధాని మోడీకి దత్తపుత్రుడంటూ ఆమె మరో సారి జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ పరిస్థితులు, పరిణామాలతో సంబంధం లేకుండా జగన్ ఎన్డీయే అభ్యర్థికి బేషరతు మద్దతు ఇవ్వడాన్ని సూటిగా ప్రశ్నించిన షర్మిల.. తెలుగుదేశం, జనసేన, జగన్ ఒకే తానులోని ముక్కలని విమర్శించారు. అయితే తెలుగుదేశం, జనసేనలు బీజేపీతో తమ బంధాన్ని బహిరంగంగా చెబుతుంటే.. జగన్ మాత్రం రహస్యంగా బీజేపీ పంచన చేరి ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటున్నారని విమర్శించారు. ఇంత కంటే దారుణం మరోటి ఉండదన్నారు. ఇండియా కూటమి తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిల బెట్టినా, జగన్ నిస్సిగ్గుగా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని బట్టే వైసీపీ బీజేపీ బీటీం అని అర్ధ మౌతోందని షర్మిల అన్నారు. వైసీపీ రాష్ట్రప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. చూడాలి షర్మిల విమర్శలకు జగన్ ఏ రకంగా స్పందిస్తారో?
http://www.teluguone.com/news/content/sharmila-strong-criticism-on-jagan-25-204786.html





