ఏపీ రాజకీయాలను మలుపు తిప్పనున్న షర్మిల కుమారుడి వివాహం?!

Publish Date:Dec 31, 2023

Advertisement

జనవరిలో ఏపీ రాకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి. మార్చిలో ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో జనవరిలో ఏపీ రాజకీయాలు ఊహకందని మలుపులు తిరగనున్నాయి. అధికార వైసీపీ సహా విపక్షాలు  జనవరిలో అభ్యర్థులను ప్రకటించనున్నాయి. దీంతో భారీ స్థాయిలో వలసలు కూడా ఉండనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార  వైసీపీ నుండి పదుల సంఖ్యలో నేతల జంపింగుకు ఆస్కారం ఉంది. అసంతృప్త ఎమ్మెల్యేలు విపక్ష పార్టీల వైపు చూస్తుండగా.. ఇప్పుడు వీరికి కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అప్షన్ గా కనిపిస్తున్నట్లు సూచనలున్నాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలిగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖరారు కాగా.. తెలంగాణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అందుకు కాస్త సమయం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో షర్మిల చేతికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ఖరారైంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి మొదటి వారంలోనే షర్మిల అధికారికంగా కాంగ్రెస్ లో చేరనుండగా.. అదే రోజున ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఆ తరువాత జనవరి మూడవ వారంలో జరగనున్న షర్మిల కుమారుడి వివాహం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పనున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. జనవరి 17న షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జోధ్ పూర్ లోని ఉమైద్ ప్యాలెస్ లో జరగనుండగా.. ఆ తర్వాత హైదరాబాద్ లో భారీ స్థాయిలో రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఇక పెళ్లి వేడుకే అయినా ఒక రకంగా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే వేడుకగా భావిస్తున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు మరికొందరు కాంగ్రెస్ పెద్దలు కూడా హాజరుకానుండగా.. ఇదే వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాలలోని నేతలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. ఒక రకంగా ఈ వేడుక నేతల సమీకరణకు వేదికగా మారనున్నట్లు చెప్తున్నారు.

ముఖ్యంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్న నేతలను షర్మిల దగ్గర చేసుకొనేందుకు తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ వేడుకను షర్మిల వేదికగా భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఒకప్పటి కాంగ్రెస్ నేతలతో విజయమ్మ సంప్రదింపులకు ఈ రిస్పెప్షన్   బీజం వేయనున్నట్లు కనిపిస్తుంది. అదే విధంగా సోదరుడు సీఎం జగన్ మోహన్ రెడ్డితో షర్మిల విబేధాలు, తల్లి విజయమ్మ షర్మిల పక్షాన అండగా నిలబడం, వైఎస్ వివేకా హత్య అనంతరం దూరమైన మరో సోదరి డాక్టర్ సునీత న్యాయపోరాటం, ఇప్పుడు వైఎస్ కుటుంబంలో అగాధాలు ఈ పెళ్లితో మరోసారి చర్చకు రానుండగా.. అసలు జగన్ కు ఈ వేడుకకు ఆహ్వానం అందుతుందా? అందినా జగన్ ఈ వేడుకకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ పెళ్లి ఏపీలో వైఎస్ అభిమానులకు ఎలాంటి సంకేతం ఇవ్వనుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా షర్మిల కుమారుడి రిసెప్షన్ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తున్నది. 

షర్మిల ఏపీ రాజకీయాలకు వస్తారా? కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే దాగుడు మూతలు ఇకలేవు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖరారైంది. ఆమె ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా పని చేయనున్నారని తేలిపోయింది. అన్న జగన్ తో షర్మిల ప్రత్యక్ష యుద్దానికి సిద్ధమేనని నిర్దారణ అయిపోయింది. అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపించారు. అది కూడా వైఎస్ కుటుంబం తరపున ఈ బహుమతులు పంపుతున్నట్లు షర్మిల శుభాకాంక్షలు తెలిపి.. వైఎస్ రాజకీయ వారసత్వంలో తనకు కూడా వాటా ఉన్నట్లు ఆమె పరోక్షంగా చెప్పేశారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని దక్కించుకునేందుకు అదే కుటుంబ వేడుకను వేదికగా మలచుకోనున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి మింగుడుపడని వ్యవహారం అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్ ఏపీ రాజకీయాలలో పెను మార్పులకు వేదిక అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.