జగన్ వి రాజకీయ ద్వంద్వ ప్రమాణాలు.. నిప్పులు చెరిగిన షర్మిల

Publish Date:Aug 15, 2025

Advertisement

వైసీపీ భయపడినంతా అయ్యింది. వైసీసీ అధినేత జగన్ కు స్వయానా సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల జగన్ పై నిప్పులు చెరిగారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో అన్యాయం జరిగిందంటూ ఆక్రోశం వ్యక్తం చేసిన జగన్.. ఆ సందర్బంగా రాహుల్ గాంధీపై కూడా విమర్శలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాహుల్ గాంధీ హాట్ లైన్ లో టచ్ లో ఉంటారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా ఖండించింది. జగన్ పై విమర్శలు గుప్పించంది. అయితే వైసీపీ మాత్రం జగన్ అనవసరంగా రాహుల్ పై వ్యాఖ్యలు చేసి షర్మిలను రెచ్చగొట్టారనీ అంతర్గత సంభాషణల్లో పేర్కొన్నారు.

ఆమె రియాక్షన్ ను పార్టీ, జగన్ తట్టుకోవడం కష్టమని బెంబేలెత్తి పోయారు. కొందరు వైసీపీయులైతే బాహాటంగానే జగన్ రాహుల్ హాట్ లైన్ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్న తమ అభిప్రాయాన్ని బాహాటంగానే చెప్పేశారు. షర్మిల ఎలాంటి విమర్శల బాంబులు పేలుస్తుందోన్న ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా వైసీపీ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో పార్టీ ప్రతిష్టే కాకుండా జగన్ ప్రతిష్ఠ కూడా దిగజారిందనీ, ఇక  షర్మిల విమర్శలకు మొదలు పెడితే జగన్ ప్రతిష్ఠ పాతాళానికి దిగజారడం ఖాయమనీ భయపడ్డారు.

వారి భయమే ఇప్పుడు నిజమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై జగన్ చేసిన విమర్శలకు షర్మల ఘాటుగా స్పందించారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాలలో ద్వంద్వ ప్రమాణాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. రాహుల్ గాంధీకి బలప్రదర్శన వ్యూహాలు తెలియవనీ, వాహనాల కింద జనాలను నలిపేయడం రాదనీ షర్మిల జగన్ వై విమర్శనాస్త్రాలు కురిపించారు. జగన్ హాట్ లైన్ గురించి మాట్లాడటం వింతగా ఉందన్న షర్మిల . చంద్రబాబు, రాహుల్ గాంధీ కాదనీ, జగనే నిత్యం  మోడీ, అమిత్ షాలప్రాపకం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు.   పార్టీ సభ్యుల తప్పులకు ఇతరులను నిందించడం జగన్ నైజం అన్న షర్మిల   జగన్ నాయకత్వాన్ని, విలువలను ప్రశ్నించారు.    రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారనీ, జగన్ కు అసలు ప్రజాస్వామ్యం అంటేనో పొసగదనీ విమర్శించారు.  

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.