ఏపీ ఎన్నికల్లో త్రిముఖ పోరు.. జగన్ బేజారు!

Publish Date:Jan 23, 2024

Advertisement

షర్మిల ఎంట్రీతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు  వేగంగా మరి పోతున్నాయా?  ఇప్పటి వరకూ ద్విముఖ పోరుగా ఉన్న పరిస్థితులు త్రిముఖ పోరుగా మారబోతున్నాయా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇంతవరకు ఓ లెక్క షర్మిల ఎంట్రీ తరువాత  ఇంకో లెక్క అన్నరీతిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయంటున్నారు.

షర్మిల ఎంట్రీకి ముందు వరకూ తెలుగుదేశం, జనసేన కూటమి, అధికార వైసీపీ మధ్య ముఖాముఖీ పోరుగా వచ్చే ఎన్నికలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషించారు. అయితే షర్మిల ఎంట్రీ తరువాత రాష్ట్రంలో జరిగేది త్రిముఖ పోరే అంటూ తమ విశ్లేషణలను సవరించుకుంటున్నారు.ఇప్పటి వరకూ అధికార వైసీపీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సక్షేమ పథకాలపైనే దృష్టిని కేద్రీకరించారు. నీట ముంచినా, పాల ముంచినా, ‘మీటదే’ భారం అన్నవిధంగా ఆయన ముందుకు సాగుతున్నారు.అయితే, కొంచెం ఆలస్యంగానే అయినా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఒక చేత్తో మీటలు నొక్కుతూ.. మరో చేత్తో రాష్ట్ర అభివృద్ధి పీక నొక్కుతున్నారని  గ్రహించారు. ప్రజలే కాదు సొంత పార్టీ నేతలూ విషయాన్ని గ్రహించారు. అందుకే  ముఖ్యమంత్రి అలోచనలు, అంచనాలతో  విభేదించి పలువురు పార్టీకి దూరం అవుతున్నారు.     

మరో వంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, టీడీపీ జగన్ రెడ్డి ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను ఎండగడుతూ జనంలోకి దూసుకు పోతోంది. జనసేన, తెలుగుదేశం పొత్తుతో  జగన్ వ్యతిరేక పవనాల తీవ్రత మరింత పెరిగింది.  ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు స్వీకరించిన షర్మిల తన ఫైర్ బ్రాండ్ విమర్శలతో అన్న జగన్ కు, వైసీపీకి చెమటలు పట్టిస్తున్నది. ఇప్పటి వరకూ తెలుగుదేశం, జనసేన పొత్తు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గంపగుత్తగా కూటమికి రావడం వల్ల జగన్ విజయావకాశాలు సన్నగిల్లిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల సారథ్యంలో దూకుడు ప్రదర్శిస్తుండటంతో చీలే ఓటు ప్రభుత్వ అనుకూల ఓటు అంటున్నారు పరిశీలకులు. జగన్ పార్టీ సొంత ఓటు చీలికతో ఇక గెలుపు అన్నది వైసీపీకి అందని ద్రాక్షగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు వల్ల అంటే షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పుంజుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయేది అధకారంలో ఉన్న వైసీపీయే అని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇన్ టాక్ట్ గా తెలుగుదేశం, జనసేన కూటమికి పడుతుందనీ, షర్మిల చీల్చే ఓట్లు మాత్రం జగన్ పార్టీకి పడే ఓట్లనేనని అంటున్నారు. దీని వల్ల ఇప్పటి వరకూ సర్వేలలో వైసీపీ గెలుచుకుంటుందని చెబుతున్న స్థానాలలో కొన్నిటిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందని విశ్లషిస్తున్నారు. 

వాస్తవానికి నిన్న మొన్నటి దాకా అంటే షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకునేంత వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ కు కనీస గుర్తింపు కూడా లేని పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే వైఎస్ వారసురాలిగా షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారో.. ఆ పార్టీలో గత పదేళ్లుగా కాగడా పెట్టి వెతికినా కనిపించని జోష్ ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అదే జగన్ పార్టీలో  పునాదులు కదిలిపోతున్నాయన్న భయాన్ని రేకెత్తిస్తున్నది. మొత్తం మీద షర్మిల ఎంట్రీ వైసీపీ ఓటమిని డిసైడ్ చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటి వరకూ జగన్ పార్టీకి రాయలసీమలో ఉన్న పట్టు  షర్మిల ఎంట్రీతో జారిపోయిందని అంటున్నారు. షర్మిల ఎంట్రీతో  ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయంటున్నారు. షర్మిల ఎంట్రీ జగన్ ఓటు బ్యాంకును గణనీయంగా చీల్చడం ఖాయమంటున్నారు. అంటే ఇప్పటి వరకూ జగన్ పార్టీ ఖాతాలో పడతాయనుకుంటున్న సీట్లలో ఎన్నో కొన్ని కాంగ్రెస్ ఖాతాలో పడతాయనీ, దీంతో వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుచుకునే స్థానాల సంఖ్య సింగిల్ డిజిట్ కు పరిమితమైనా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.