వైఎస్ రాజకీయవారసుడు నా కొడుకే.. షర్మిల ప్రకటనతో వైసీపీలో గాభరా

Publish Date:Sep 12, 2025

Advertisement

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ  భయాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల నిజం చేసేశారు. వైఎస్ రాజకీయవారసుడిగా జగన్ వినా మరొకరు లేరని వైసీపీయులు ఎంతగా అరిచి, గొంతు చించుకుని చెప్పుకుంటున్నా..  షర్మిల కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ  వారిలో భయాన్నీ, అభద్రతా భావాన్నీ పెంచేసింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి.. తల్లి వెంట ఒక్క పర్యటనలో పాల్గొన్నారో లేదో వైసీపీలో గగ్టోలు మొదలైంది.

అంతే వైసీపీయులు విమర్శలు, ఆరోపణలతో చెలరేగిపోయారు. రాజారెడ్డి వైఎస్ వారసుడెలా అవుతారు? అందుకు అవకాశమే లేదు అంటూ మీడియా, సోషల్ మీడియాలో పోస్టులు, ప్రకటనతో రెచ్చిపోయారు. దీంతో షర్మిల రియాక్ట్ అయ్యారు. ఎవరు ఔనన్నా కాదన్నా వైఎస్ రాజకీయ వారసుడు తన కుమారుడేనని కుండబద్దలు కొట్టేశారు. తన కుమారుడికి రాజారెడ్డి పేరును స్వయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టారని గుర్తు చేశారు. ఎవరు ఎంతగా మొత్తుకున్నా, అరిచి గీపెట్టినా దీనిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేసేశారు.  తన కుమారుడు ఇంకా రాజకీయాలలోకి అడుగు పెట్టనే లేదు.. అప్పుడే జగన్  వైసీపీలో ఇంత గాభరా వారిలోని భయాన్ని, అభద్రతా భావాన్నీ సూచిస్తోందని అన్నారు. 
జగన్ రెడ్డి తన తండ్రి రాజకీయ సిద్ధాంతాలను పక్కన పెట్టేసి మరీ రాజకీయ లబ్ధి, ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన రాజకీయ జీవితమంతా వ్యతిరేకించిన బీజేపీతో జగన్ చేతులు కలిపారని షర్మిల పేర్కొన్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ బీజేపీ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. కేసుల భయంతో బీజేపీకి అణిగిమణిగి ఉండటమే కాకుండా ఆ పార్టీ నాయకత్వానికి అడుగులకు మడుగులొత్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  తన సొంత రాజకీయ మనుగడ కోసం జగన్ బీజేపీతో రాజీపడిపోయారన్న షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి నిజమైన రాజకీయ వారుసుడిగా ఉంటారనీ, వైఎస్ ఆశయాలు, విలువలను కొనసాగిస్తారని షర్మిల అన్నారు. 

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.