షర్మిల కోడలు బ్యాక్ గ్రౌండ్ గురించి అసలు నిజాలివే!

Publish Date:Jan 3, 2024

Advertisement

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా తన కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి ఇడుపులపాయకు వెళ్లి ప్రత్యేక పార్ధనలు నిర్వహించారు. కుమారుడి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షర్మిల వెంట ఆమె తల్లి వైఎస్ విజయమ్మ, కొంత మంది బంధువులు కూడా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుందని, వైఎస్సార్‌తో పాటు ప్రజలందరి దీవెనలు కొత్త దంపతులపై ఉండాలని షర్మిల అన్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి, ఆయన కాబోయే భార్య  ప్రియా అట్లూరి జంటకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అసలు ఇంతకీ రాజారెడ్డి చేసుకోబోయే ప్రియా అట్లూరి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? రాజారెడ్డి-ప్రియా అట్లూరి పరిచయం ఎలా జరిగింది అన్నది ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రియా ఎవరనేదానిపై చాలా రకాల ఊహాగానాలు కూడా ఇప్పటికే హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ప్రియా ఎవరన్నది ఆసక్తిగా మారింది.

వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పడగా.. అది కాస్త ప్రేమగా మారిందని చెబుతున్నారు. అయితే, ఈ ప్రేమికులిద్దరూ తమతమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇక, ప్రియా అట్లూరి చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని తొలుత ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదు. బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె అట్లూరి ప్రియా కాగా.. అట్లూరి శ్రీనివాస్‌కు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉందని తెలుస్తోంది. బ్రదర్ అనిల్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీలుకూడా ప్రియా తండ్రే చూస్తున్నారని చెప్తున్నారు. కాగా అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. అమెరికా పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రియా కుటుంబం ఎప్పుడో  క్రైస్తవ మతాన్ని స్వీకరించారని కూడా తెలుస్తోంది. మొత్తంగా అట్లూరి కుటుంబానికి బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని చెప్తున్నారు. 

జనవరి 18న వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియాల నిశ్చితార్థం వేడుక జరగనుండగా.. ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనుంద‌ని తాజాగా స్వయంగా ష‌ర్మిలనే ప్రకటించారు. రాజారెడ్డి, ప్రియా వివాహం రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్ లో నిర్వహించనున్నట్లు సమాచారం ఉండగా.. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగబోయే వీరి పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక, అంతకు ముందే హైదరాబాద్ లో నిశ్చితార్థం వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్తున్నారు. ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్లాన్ చేశారట. ఇప్పటికే బంధువులకు ఆత్మీయులకు స్నేహితులకు ఇన్విటేషన్ కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంగళవారం (జనవరి 2న) కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకొని పూజలు నిర్వహించారు.

ఇక, ఇడుపుల పాయలో మీడియాతో మాట్లాడిన షర్మిల సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీ విలీనం ప్రక్రియ పూర్తి కానున్నట్లు, కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించనున్నట్లు షర్మిల వెల్లడించేశారు. దీంతో హైదరాబాద్ లో జరగనున్న నిశ్చతార్థం వేడుకపై ప్రత్యేక ఆసక్తి మొదలైంది. షర్మిల ఇంట పెళ్లి భజంత్రీలతో పాటు ఈ జనవరి నెలలలోనే షర్మిల రాజకీయ జీవితంలో కూడా కీలక మలుపులు తిరగనున్నట్లు కనిపిస్తుంది. షర్మిల ఏపీకి రానుండడం, స్వయంగా అన్న జగన్ మీదనే తలపడనుండడంతో.. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

ఇక షర్మిల తాడేపల్లికి వెళ్లి స్వయంగా బుధవారం అన్న జగన్ ను కలిసి కుమారుడు పెళ్లికి ఆహ్వానం పలికారు.  కాగా ఈ సందర్భంగా అన్నా చెళ్లెళ్ల మధ్య ఏం జరిగిందీ, షర్మిల కాంగ్రెస్ గూటికి చేరనుండటంపై జగన్ ఏమైనా వ్యాఖ్యలు చేశారా?  షర్మిల ఏం మాట్లాడారు? వంటి అంశాలపై  రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద షర్మిల వైఎస్సార్టీపీ పెట్టుకుని పొరుగురాష్ట్రం వెళ్లిన తరువాత ఇరువురూ కలిసిన సందర్భం ఇదే కావడం గమనార్హం. షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఏపీ రాజకీయాలలో క్రీయాశీలం కావడం జగన్ కు కచ్చితంగా ఇబ్బంది కలిగిస్తుందన్న విశ్లేషణల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.