దత్తపుత్రుడు జగన్.. హవ్వ షర్మిల అంత మాటనేశారేంటి?

Publish Date:Feb 21, 2025

Advertisement

మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించ కతప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపించక మానదు. గతంలో అంటే జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలో తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు వ్యవహరించే వారు. నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా ప్రత్యర్థి పార్టీల నేతలను ఇష్టారీతిగా విమర్శలు గుప్పించే వారు. భాషను ఉపయోగించే విషయంలో  జగన్ ఇసుమంతైనా మర్యాద పాటించిన  దాఖలాలు లేవు.

ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత భాషాప్రయోగం చేశారు. ఇక జనసేనాని వపన్ కల్యాణ్ విషయంలో అయితే చెప్పనే అవసరం లేదు. పవన్ కల్యాణ్ వివాహాలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండేవి. సరే ఇక పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన ఎప్పుడూ దత్తపుత్రుడు అని సంబోధిస్తూ ఉండేవారు. చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతున్నారు కనుక ఆయన చంద్రబాబు దత్తపుత్రులు అన్నది ఆయన భావన.  ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా జగన్ ప్రత్యర్థులను కించపరిచే వ్యాఖ్యలు చేయడానికి ఇసుమంతైనా వెనుకాడే వారు కాదు. 

ఇప్పుడు ఆయన దత్తపుత్రుడు వ్యాఖ్య అయనకే ఎదురువచ్చి తగిలింది. సొంత సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల జగన్ ను దత్తపుత్రుడు అని సంబోధించింది. కౌపీన సంరక్షార్థం.. అంటే కేసుల నుంచి రక్షణ కోసం జగన్ బీజేపీకి, ప్రధాని మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయారని షర్మిల విమర్శించారు. అధికారంలో ఉన్నంత కాలమూ జగన్ మోడీ దత్తపుత్రుడుగానే ఉన్నారన్న షర్మిల, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  పవన్ కళ్యాణ్‌ను కించపరిచేందుకు జగన్ చాలా తరచుగా ఉపయోగించిన  దత్తపుత్రుడు  అనే పదాన్నే ఇప్పుడు  సొంత సోదరి షర్మిల జగన్ ను ఉద్దేశించి వాడారు. అందుకే అంటారు కర్మ ఎవరినీ వదలదని. 

By
en-us Political News

  
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.