బాబాయ్ కోరిక షర్మిల తీరుస్తున్నారా?.. పులివెందుల నుంచే పోటీ.. ప్రకటన ఎప్పుడంటే..?

Publish Date:Jan 2, 2024

Advertisement

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 4న వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనమయ్యే లాంఛనాన్ని హస్తినలో పూర్తి చేస్తారు. ఈ మేరకు ఢిల్లీ మీడియాలో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయి. అసలు కాంగ్రెస్ నుంచే ఢిల్లీ మీడియాకు లీకులు వెళ్లాయని అంటున్నారు. ఇలా ఉండగా షర్మిల తన కుమారుడి పెళ్లి పనులలో బిజీగా ఉండి కూడా పార్టీ విలీనం, తాను ఏపీ కాంగ్రెస్ లో క్రీయాశీల పాత్ర తదితర విషయాలపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. మంగళవారం  (జనవరి2 )  ఉదయం హైదరాబాద్ లోఅందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో  షర్మిల భేటీ అయ్యారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు. ఆ చర్చల అనంతరం ఆమె కుటుంబ సమేతంగా ఇడుపుల పాయకు బయలుదేరి వెళ్లారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇడుపుల పాయలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ శుభలేఖను తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వచ్చే ఎన్నికల్లో షర్మిల కడప నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆమె పులివెందుల పర్యటన, అక్కడ నుంచి చేయబోయే విలీనం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.  పులివెందులలో వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల తన రాజకీయ భవిష్యత్ పై చేసే ప్రకటన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఒక వేళ ఆమె తాను పులివెందుల నుంచి  బరిలోకి దిగనున్నట్లు వైఎస్సార్ ఘాట్ వద్ద నుంచ ప్రకటన చేస్తే రాష్ట్ర రాజకీయాలలో  పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా సొంత బాబాయ్, దివంగత వైఎస్ వివేకా కూడా షర్మిల పులివెందుల నుంచి పోటీ చేయాలని ఆకాంక్షించారు. ఆ డిమాండ్ తోనే అనినాష్ రెడ్డికి శతృవయ్యారు. గొడ్డలి పోటుకు హతమయ్యారు. ఇప్పుడు షర్మిల పులివెందుల నుంచి రంగంలోకి దిగితే బాబాయ్ కోరిక నెరవేర్చినట్లే అవుతుంది. షర్మిల పులివెందుల నుంచి పోటీ నేపథ్యంలో    చెల్లితో తలపడే ధైర్యం జగన్ చేస్తారా? లేక నియోజకవర్గం వదిలేసి మరో స్థానం వెతుక్కుంటారా? అన్న చర్చ ఇప్పటికే మొదలైంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర రాజకీయాలలో  క్రీయాశీలంగా వ్యవహరించడమంటూ జరిగితే.. వైసీపీలో కాంగ్రెస్ వాదులంతా షర్మిల పంచన చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ పట్ల అసంతృప్తితో ఉన్న వారంతా షర్మిల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి ధిక్కార స్వరం వినిపించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంటే తాను అని ప్రకటించడమే కాకుండా.. షర్మిల వెంట పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.  

షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైనప్పటికీ వైఎస్ సతీమణి, షర్మిల తల్లి విజయమ్మ నిర్ణయం ఏలా ఉంటుందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కుమారుడికి వ్యతిరేకంగా ఆమె కూడా ఏపీలో షర్మిలతో పాటు కాంగ్రెస్ తరఫున గట్టిగా నిలబడతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయమ్మ నోటి వెంట ఇప్పటి వరకూ షర్మిల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని ఏపీలో అన్నకు వ్యతిరేకంగా పని చేస్తారన్న వార్తలపై ఎటువంటి స్పందనా రాలేదు. 

గతంలో  ఒక సందర్భంగా విజయమ్మ  తన బిడ్డలు ఎవరికి వారుగా రెండు రాష్ట్రాలలో రాజకీయపార్టీలు స్థాపించి ఎవరి పని వారు చేసుకుంటారనీ, ఒకరిపై ఒకరు తలపడరనీ, పోటీ చేయరనీ చెప్పారు. అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని తేటతెల్లమైపోయింది. షర్మిల తెలంగాణను వదిలి ఏపీలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించేందుకు నిర్ణయం తీసేసుకున్నారు.  

అంతే కాదు జగన్ పార్టీ లక్ష్యంగానే ఆమె ఏపీలో రాజకీయం చేయనున్నరనీ, అవసరమైతే జగన్ కు ప్రత్యర్థిగా పులివెందుల నుంచి పోటీకి దుగుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో  విజయమ్మ ఎవరికి మద్దతు తెలుపుతారన్నది కీలకంగా మారింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు విజయమ్మ తన కుమార్తె షర్మిలతో పాటే ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఆమె బయటకు వచ్చి ప్రచారం చేసే అవకాశాలు లేవని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు విజయమ్మ ఏ నిర్ణయం తీసుకుంటారో. షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయం బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆమె తన కుమారుడు జగన్ నివాసానికి వెళ్లలేదు. ఆమె విజయవాడ వెళ్లినప్పటికీ జగన్ ను నివాసానికి వెళ్లిన దాఖలాలు లేవు.  వీటన్నిటినీ ప్రస్తావిస్తూ పరిశీలకులు ఆమె జగన్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు మృగ్యమేనని విశ్లేషిస్తున్నారు.  .

By
en-us Political News

  
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.