సీబీఐ కిచ్చిన వాంగ్మూలంతో తెలుగుదేశం పార్టీకి షర్మిల క్లీన్ చిట్!

Publish Date:Nov 7, 2022

Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు వెనుక ఉన్న చిక్కుముడులు విడివడుతున్న సంకేతాలు గోచరిస్తున్నాయి. మూడేళ్ల తరువాతైనా ఈ కేసులో నిందితులు ఎవరన్నది బయటపే సూచనలు కనిపించడానికి వివేకా కుమార్తె డాక్టర్ సునీత అలుపెరుగని న్యాయ పోరాటం ఒక కారణమైతే.. మరో కారణం మాత్రం కచ్చితంగా వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలేననడంలో సందేహం లేదు. ఈ కేసులో షర్మిల ఢిల్లీ వెళ్లి మరీ వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసులో నిందితుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండటమే కాదు.. తాడేపల్లిలోని జగన్ ప్యాలస్ కూడా షేక్ అవ్వడం మొదలైందని అంటున్నారు. షర్మిల వాంగ్మూలంతోనే వివేకా హత్య కేసు వెనుక కుటుంబ కలహాలు, రాజకీయ నేపథ్యం ఉన్నాయన్న విషయం నిర్ధారణ అయ్యిందని కూడా చెబుతున్నారు.

షర్మిల వాంగ్మూలం కారణంగానే వివేకా హత్య కేసు సూత్రధారులు, పాత్రధారులు కూడా తప్పించుకోలేకుండా ఇరుక్కోవడం ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ హత్య కేసు విచారణను రాష్ట్రం బయట జరపడానికి సుప్రీం సూత్ర ప్రాయంగా అంగీకరించడంతో విచారణ వేరే రాష్ట్రానికి మారడం ఖాయమనీ, అప్పుడు ఇప్పట్లా కడప జిల్లా పులివెందులలో దర్యాప్తునకు ఆటంకాలు కలిగించినట్లు కలిగించడం సాధ్యం కాదనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వివేకా హత్య కేసులో గుండె పోటు.. నరాసుర రక్త చరిత్ర వంటి వైసీపీ వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని ఇప్పటికే తేలిపోయిన నేపథ్యంలో.. అప్పట్లో అటువంటి వార్తలు మీడియాలో రావడానికి వెనుక ఉన్న కారణాలు, వ్యక్తుల గుట్టు కూడా రట్టయ్యే పరిస్థితి షర్మిల వాంగ్మూలంతో ఏర్పడిందని చెబుతున్నారు.

షర్మిల వాంగ్మూలం వివేకా హత్య కేసులో తెలుగుదేశం పార్టీకి క్లీన్ చిట్ ఇవ్వడంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో తన సొంత అన్న జగన్, ఆయన ప్రభుత్వాన్ని షర్మిల వాంగ్మూలం షేక్ చేసేసిందని అంటున్నారు. వైసీపీ శ్రేణులే షర్మిల చెప్పినవే వాస్తవాలు అయి ఉంటాయని భావించే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక ప్రజలు కూడా షర్మిల మాటలనే విశ్వసిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. షర్మిల వాంగ్మూలం ఇప్పటికే వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేసిందనీ, ఇక విచారణ జరిగి దోషులను చట్టం ముందుకు తీసుకురావడం అన్నది కోర్టులు, దర్యాప్తు సంస్థలు చేయాల్సిన పని అని జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో జనం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో సీబీఐకి షర్మిల ఇచ్చిన వాంగ్మూలంతో వైసీపీ రాజకీయంగా డిఫెన్స్ లో పడింది.  

అందుకు నిదర్శనం షర్మిల వాంగ్మూలం మీడియాలో వచ్చిన తరువాత కూడా వైసీసీ వర్గీయుల నుంచి ఇంత వరకూ ఎటువంటి స్పందనా రాకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు.. కడప ఎంపీ సీటు కోసమేనని షర్మిల మీడియా ముఖంగా ప్రకటించిన తరువాత కూడా వైసీపీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీనినే పరిశీలకులు వైసీసీ ఆత్మరక్షణలో పడిందనడానికి తార్కానంగా చెబుతున్నారు.    

షర్మిల తాజాగా వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి ఉన్నారన్నది తన అనుమానం అంటూ సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చినట్లుగా లీక్ అవ్వడంతో వైసీపీ మైండ్ బ్లాక్ అయినట్లు కనిపిస్తోంది.  షర్మిల వాంగ్మూలంతో తెలుగుదేశం ఇంత కాలం భరిస్తూ వచ్చిన ఆరోపణలను నుంచి పూర్తిగా విముక్తి పొందిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. 
వివేకా కూతురే కాకుండా.. జగన్ కు స్వయానా తోడబుట్టిన సోదరి కూడా  తన చిన్నాన్న హత్యలో ఎవరున్నారో వెల్లడించిన నేపథ్యంలో, జగన్‌ హత్యా రాజకీయాల చరిత్రను గమనించాలంటూ, టీడీపీ విమర్శల దాడి ప్రారంభించింది.  షర్మిల వాంగ్మూలంపై దమ్ముంటే మాట్లాడాలని ఏకంగా జగన్ కే సవాల్‌ విసిరింది.

అయినా జగన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. నిజానికి తన వాంగ్మూలంతోనే వివేకా హత్య పూర్తిగా కుటుంబంలో రాజకీయ ఆకాంక్షల కారణంగా జరిగిందనీ, ఈ హత్య వెనుక ఉన్నది కుటుంబానికి చెందిన వారేననీ షర్మిల విస్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు వైసీపీలో ఎవరైనా సరే ఈ హత్య వెనుక టీడీపీ ఉందని ఎదురుదాడి చేద్దామనుకున్నా, చేయాలనుకున్నా జనం నమ్మరని తెలియడంతోనే ఆ పార్టీ మౌనాన్నే ఆశ్రయించిందని పరిశీలకులు అంటున్నారు.

పైగా ఇదంతా జగన్‌ కుటుంబ వ్యవహారం, ఇందులో తలదూర్చి మాట్లాడాల్సిన అవసరం మాకేమిటని కూడా కొందరు వైసీపీ నేతలు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తం మీద షర్మిల వాంగ్మూలం జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసిందన్నది మాత్రం కాదనలేని వాస్తవమని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.అలాగే వివేకా హత్య విషయంలో తమ పార్టీ  టీడీపీపై వేసిన  ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని కూడా ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడిపోయిందని ఆ వర్గాలు చెబుతున్నాయి.  

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.