వైఎస్ వారసత్వ పోటీలో వెనుకబడ్డ జగన్!?

Publish Date:Jan 11, 2025

Advertisement

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య తమ తండ్రి వైఎస్ రాజకీయవారసత్వం కోసం తీవ్రమైన పోటీ జరుగుతోంది. అయితే ఈ పోటీలో షర్మిలే ఒకింత ముందున్నారన్న అభిప్రాయం కూడా ప్రజలలో వ్యక్తం అవుతున్నది. నిర్భయంగా, నిస్సంకోచంగా షర్మిల తన అన్న, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలను ఎండగట్టడమే కాకుండా, వైఎస్ ఆశయాలకు తూట్లు పొడిచారంటూ పలు ఉదంతాలను సోదాహరణంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడింది లేదు. పైగా నిఖార్సైన కాంగ్రెస్ నేతగా ఆయన తన జీవితాంతం బీజేపీని వ్యతిరేకించారనీ, అందుకు భిన్నంగా తన అన్న, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బీజేపీతో అంటకాగుతున్నారనీ విమర్శిస్తున్నారు. 

వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పేర సొంత పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఆయన కుటుంబం మొత్తం ఏకతాటిపై నిలిచింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన కుటుంబం ముక్తకంఠంతో జగన్ ను ప్రకటించింది. అయితే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంతే అప్పటి నుంచీ పరిస్థితి మారిపోయింది.

 ఆ మార్పు ఎలా ఎందుకు వచ్చిందంటే.. ఎదుగింటి సందింటి  రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్)  కుటుంబం లో యుద్ధం మొదలయింది. ఆస్తుల తగాదా నుంచి అది వారసత్వ పోరు వరకూ వెళ్లింది.  ఆస్తుల పోరు కాస్తా రాజకీయ వారసత్వ రణం వరకూ వెళ్లింది.  ఈ యుద్ధంలో అన్న జగన్ ఒక వైపు.. చెల్లి వైఎస్ షర్మిల మరో వైపు మోహరించారు. అమ్మ కుమార్తె షర్మిల వైపే నిలిచారు. వాస్తవానికి రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుటుంబం మొత్తం ఒక్కటై నిలిచింది. కష్ట కాలంలో ఒకరినొకరు ఓదార్చుకోవడంలో కానీ, తండ్రి రాజకీయ అండ చేజారిపోకుండా చూసుకోవడంలో కానీ, రాజకీయంగా కుటుంబం పెత్తనం సడలిపోకుండా కాపాడుకోవడంలో కానీ తల్లి, కుమారుడు, కుమార్తె, వీళ్లే కాకుండా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుటుంబం ఇలా మొత్తం వైఎస్ కుటుంబం అంతా ఏకతాటిపై నిలిచింది.   

జగన్ సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ అధినేతగా తన సొంత రాజకీయ ప్రయాణం ఆరంభించారు. 2014 ఎన్నికలలో విభజన ఎమోషన్స్ తో పాటు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ పై ఉన్న పలు కేసులు, ఆయన వ్యవహార శైలిపై ప్రజలలో ఉన్న సంశయాలు, అనుమానాల కారణంగా జగన్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోయింది. అయితే విపక్ష నేతగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి పాదయాత్ర, ఓదార్పు యాత్ర అంటూ నిత్యం జనంలోనే గడిపారు. ఆయన ఆక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో వచ్చిన సానుభూతి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై జనంలో ఉన్న అభిమానానికి తోడు, సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వంటి సంఘటనలు జగన్ కు ప్లస్ అయ్యాయి. దాంతో ఆ ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైసీపీ విజయానికి పైన చెప్పిన అన్ని కారణాలతో పాటు వైఎస్ కుటుంబం మొత్తం జగన్ కు అండగా నిలబడటం కూడా ప్రధాన కారణంఅనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. జగన్ జైల్లో ఉన్న సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేసిన ప్రచారం, ప్రసంగాలు, జగన్ తల్లి విజయమ్మ కుమారుడి కోసం రోడ్డుపై బైఠాయించి మరీ తెలిపిన నిరసనలు, బాబాయ్ వైఎస్ వివేకా, ఆయన కుమార్తె డాక్టర్ సునీత వెన్నంటి ఉండటం ఇలా ఇవన్నీ జగన్ కు  కలిసి వచ్చాయి.   ఇదేళ్లు గిర్రున తిరిగే సరికి నాడు అంటే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ కు కలిసి వచ్చిన అంశాలే   ఆయనకు 2024 ఎన్నికలలో ప్రతికూలంగా మారాయి. 

నాడు జగన్ వెనుక ఐక్యంగా నిలిచిన కుటుంబం అండ లేకుండా పోయింబది. నాడు జగన్ కు అనుకూలంగా సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన వివేకా హత్య, కోడికత్తి దాడి కేసుల్లో ఇప్పుడు వెళ్లన్నీ ఆయన వైపే చూపించాయి. అలాగే నాడు జగన్ కు కొండంత అండగా నిలిచిన చెల్లి వైఎస్ షర్మిల ఆయనకు వ్యతిరేకంగా 2024 ఎన్నికలలో కాంగ్రెస్ ఏపీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టారు. నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన షర్మిల 2024 ఎన్నికలలో జగన్ కు గురిపెట్టిన బాణంగా మారి ఆయనపై విమర్శలు గుప్పించారు.  ఇవన్నీ కూడా జగన్ స్వయంకృతాపరాధాలే అని చెప్పక తప్పదు.  తల్లి చెల్లి సహా వైఎస్ కు సన్నిహితులు అన్న వారందరినీ జగన్ వదిలించేసుకున్నారు.  

సరే ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు మారలేదు. తనపై విమర్శలు గుప్పించిన చెల్లి షర్మిలపై తన సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేయించారు. దీంతో ఆమె జగన్ పై మరింత తీవ్రంగా విమర్శల దాడి చేస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఆమె  మరోసారి వైఎస్ రాజకీయ వారసురాలిని తానే నని ప్రకటించుకున్నారు. ప్రధాని మోడీతో జగన్ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను తుంగలోకి తొక్కి జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.  జగన్ బీజేపీతో  అంటకాగుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడినని ఎలా చెప్పుకుంటారని నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది తాను మాత్రమే అని చెప్పారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని షర్మిల స్పష్టం చేశారు. మొత్తంగా వైఎస్ వారసత్వ పోరులో జగన్ ను వెనక్కు నెట్టి షర్మిల ముందుకు వచ్చారని చెప్పకతప్పదు. అధికారంలో ఉండగా వైఎస్ బ్రాండ్ ను వదిలించుకుని సొంత బ్రాండ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించిన జగన్.. ఓటమి తరువాత మళ్లీ వైఎస్ పేరు జపిస్తుండటం సహజంగానే జనంలో ఆయనను చులకన చేసింది. దీంతో షర్మిల వైపునకే వైఎస్ అభిమానులు మొగ్గు చూపుతున్నారు. 

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.