Publish Date:Apr 24, 2023
వైఎస్సార్టీపీ ధ్యక్షురాలు షర్మిలపై పోలీసులు మళ్లీ కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 330 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు అయింది. నిరుద్యోగ సమస్యలపై హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సోమవారం ధర్నాకు షర్మిల సిద్ధమయ్యారు. ఆ క్రమంలో లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసం నుంచి ధర్నాకు బయలుదేరే క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఆమె.. వాహనం దిగి.. తనను అడ్డుకొన్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతోపాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులపై చేయి కూడా చేసుకున్నారు. అంతే కాకుండా.. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే ఆమె బైఠాయించి తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గత ఏడాది నవంబర్‌లో షర్మిల వరంగల్ జిల్లాలోని నరసన్నపేటలో తన పాదయాత్ర సమయంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో.. బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నాకు బయలుదేరడం.. ఆ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకోని... పంజాగుట్టు పీఎస్‌కు తరలించి.. వైయస్ షర్మిలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే గతేడాది అక్టోబర్‌లో అందోల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు క్రాంతికిరణ్‌ని వైయస్ షర్మిల అవమానించే విధంగా మాట్లాడారంటూ.. దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ జోగిపేటలో పోలీసులను ఆశ్రయించారు.
దీంతో వైయస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా షర్మిలను కలుసుకోవడానికి పీఎస్ కు వెళ్లిన విజయమ్మకు పోలీసులు అందుకు అనుమతివ్వకపోవడంతో ఆమె కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై చేయి చేసుకున్నారు. దీంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sharmila-and-vijayamma-rude-behaviour-on-police-25-154176.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.