స్వరూపానందులకు.. సేవానందలహరి!

Publish Date:Nov 8, 2020

Advertisement

టీటీడీ అధికారుల సేవ చూడతరమా?

 

ఆయన జగద్గురువే కాదు. ‘జగన్గు’రువు కూడా. ఆ రెండేకాదు. లోకరక్షకుడు. అంతకంటే ముందు విశాఖ రక్షకుడు కూడా! ఆ స్వామివారు అక్కడ నడయాడుతున్నందుకే, విశాఖ శత్రుదుర్భేద్యంగా మారింది. నేను ఉన్నాను-నేను విన్నాను అని జగనన్న మాదిరిగా చెప్పకపోయినా.. ఆయన ఉన్నారన్న భరోసాతోనే అక్కడ నౌకాదళం ఏర్పాటుచేశారన్నది ఓ ప్రతీతి. స్వామివారు విశాఖలో లేకపోతే ఎగసిపడే సాగర కెరటాలు, ఆయన వచ్చాకనే శాంతిస్తాయన్నది ఓ నానుడి. ఆయన దగ్గరికి సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు.. సాధారణ రేషన్‌డీలర్ల సంఘం నాయకులు కూడా వచ్చి, తమ ఈతిబాధలు వెళ్లబోసుకుంటారు. అంత ‘పవర్’ఫుల్ స్వామి ఆయన!

 

ఆ స్వాములోరే స్వయంగా.. క్రైస్తవుడిగా ఉన్న జగన్‌బాబును, గంగలో మూడు మునకలేయించి, ‘కరుడుగట్టిన హిందూవాది’గా మార్చారని, మన నందమూరి లక్ష్మీపార్వతమ్మ తాదాత్మ్యంతో ధృవీకరించారు. అలాంటి ‘అభినవ ఆదిశంకరాచార్య’కరుణా కటాక్షాలు, కఠోర తపస్సుతోనే మన జగనన్న..   దేశం మెచ్చిన నలుగురు ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరు కాగలిగారు. అంటే స్వామివారు ఒక ఉత్తమ ముఖ్యమంత్రిని దేశానికి అందించారన్నమాట!

 

ఆ తపస్వి- రాజర్షి-మహర్షుల వారి చల్లని చూపులు ప్రసరిస్తున్నందుకే.. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి, అన్ని రంగాల్లో పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడే స్థాయిలో, పరుగులు తీస్తోంది. మరి అలాంటి భగవంతుడి అవతారమయిన స్వామివారు.. ఎయిర్‌పోర్టుకు వస్తే, టీటీడీ అధికారులు ఆయనకు ఎదురేగి స్వాగత సత్కారాలివ్వడం కూడా తప్పేనా? కలికాలం కాకపోతే.. అసలు అది కూడా ఒక వార్తనా? ఇవీ.. నడిచే దేవుడయిన, విశాఖ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి భక్తకోటి.. ఆవేదన-ఆర్తి-ఆగ్రహం కలగలిపి కారుస్తూ, సంధిస్తున్న ‘భక్తకన్నీటి’ప్రశ్నలు.

 

లేటెస్టుగా విశాఖ స్వాములోరు, తిరుమల దర్శనానికి వెళ్లారు. సరే.. ఆ పిచ్చికాలంలో అంటే శంకరాచార్యుల వారంటే.. ఫ్లెక్సీ స్వాగతాలు, పేపర్ యాడ్స్, పోలీసు కాన్వాయ్, వీవీఐపీలు పక్కన లేకుండానే దేశమంతా పాదయాత్ర చేశారు. మరి ఇప్పుడూ అలాగే చేయాలంటే ఎలా? ఎంచక్కా విమానాలు, బెంజికార్లు ఉన్న ఈ కాలంలో కూడా.. పాతకాలపు శంకరాచార్యుల మాదిరి నడిస్తే, పెద్ద ఇమేజ్-మీడియా కవరేజీ ఏముంటుంది? అందుకే విశాఖ స్వాములోరు, సరదాగా విమానంలో వచ్చారు. దానిపై కూడా విమర్శలు! హేమిటో? హెందుకో అర్ధం కాదు.

 

మరి అంతలావు సర్కారీ స్వాములోరు ఎయిర్‌పోర్టుకు వస్తే, ఆయనకు బాజా భజంత్రీలతో కాకపోయినా, కనీసం శాలువ-జగనన్నమాల.. సారీ..  గజమాలతో వెళ్లయినా స్వాగతించాలి కదా? మన టీటీడీ చైర్మన్ సహిత అధికారులు, ఎయిర్‌పోర్టుకు ఎదురేగి.. అలాగే స్వామివారిని స్వాగతించారు. ఒక రాజర్షికి చేసిన ఈ సాదాసీదా సన్మానం-గౌరవానికే సోషల్ మీడియా, గిట్టని రాజకీయ పార్టీలు గావుకేకలు పెట్టి.. గాయిగత్తర చేయడం స్వామివారి,  అనంతకోటి భక్తులకు సుతరామూ నచ్చడం లేదట. వారి సున్నిత హృదయాలు గాయపడ్డాయట.

 

అసలు స్వామివారి మహత్తు- త్యాగం ముందు.. ఈ గజమాల సన్మానాలు ఏ మూలకు పనికివస్తాయన్నది వారి ప్రశ్న. మరి స్వామి వారు తిరుమలకు వెళ్లినప్పుడు, శ్రీ వేంకటేశ్వరుడు కొండ దిగి, ఆయనకు స్వాగతం పలికే వీలు లేదు కదా? ఇప్పటికయితే వారికి ఆ ప్రొటోకాల్ ఇంకా కల్పించలేదు. కాబట్టి, ఆ ప్రకారం.. శ్రీవారి ప్రతినిధులుగా టీటీడీ అధికారులు, చైర్మన్ వస్తే తప్పేంటి? ఆయనకేమీ మణులు మాణిక్యాలు ఇవ్వలేదు కదా? జస్ట్. ఎయిర్‌పోర్టుకు వెళితే తప్పేంటన్నది స్వామివారి భక్తుల ప్రశ్న. అవును మరి. వారి వేదనా వినదగ్గదే!

 

నిజమే.. నిజానికి స్వామి వారు వచ్చినప్పుడు శ్రీవారే స్వయంగా వచ్చి స్వాగతించాలి. అలాంటి ప్రొటోకాల్ పాటించటం.. ఈ యుగంలో విగ్రహరూపంలో ఉన్న, ఆ యుగం శ్రీవారికి తెలియదు. కాబట్టే తన ప్రతినిధులుగా అధికారులను పంపారని సరిపెట్టుకోక, ఈ యాగీ ఏమిటి? అందుకే కదా గతంలో కూడా,  రాజర్షుల వారిని మూలవర్లకు అలంకరించే ఆకుతో చేసిన రామచిలకను, తిరుమల నుంచి అలిపిరికి తెచ్చిన.. ‘ధర్మాత్ముడైన ధర్మాధికారి’, మన  ధర్మారెడ్డిని భక్తులు తెగ మెచ్చుకుంది? గోశాలను-అందులోని గోవుల జన్మను, ధన్యం చేసేందుకు వచ్చిన మహర్షుల వారిని.. డాలర్‌శేషాద్రి వంటి సంఘసేవక స్వామి సహా, అధికారులు వచ్చి, మేళతాళాలు-బాజా భజంత్రీలతో స్వాగతించి, భక్తుల మెప్పు పొందింది కూడా అందుకే కదా? 

 

ఇవన్నీ తెలియని పిచ్చి వాళ్లు, మతిలేని గతితప్పిన వాళ్లంతా.. స్వామివారిని ఆడిపోసుకోవడం మహాపచారమే కదా? అయినా మన పిచ్చి గానీ.. ‘పైవాడి’ ఆజ్ఞలేకపోతే.. స్వామి వారికి ఇంత భోగం పడుతుందా చెప్పండి? ఆ ‘పైవాడి’ ఆజ్ఞలేక, ఆగ్రహంతోనే కదా.. తమిళనాడులో కంచిస్వామివారు చెరసాలపాలయింది! హేమిటో.. ఈ జనం హెప్పుడు మారతారో హేమో?!

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.