మహిళలపై కొంటె కామెంట్లు విసిరిన శరద్ యాదవ్..

Publish Date:Mar 14, 2015

Advertisement

 

జేడీయు నాయకుడు శరద్ యాదవ్‌కి వయసు అయిపోయినా వగరు, పొగరు తగ్గినట్టు లేదు. తలలు బోడులైన తలపులు బోడులౌనా అని ఇలాంటి పెద్దమనుషులను చూసే అని వుంటారు. పార్లమెంటులో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద చర్చ జరుగుతుండగా, ఈ పెద్దమనిషి లేచి నిలబడి సంబంధం లేని వ్యాఖ్యలు చేశాడు. అది కూడా దక్షిణ భారతదేశానికి చెందిన మహిళల మీద. శరద్ యాదవ్ తన ప్రసంగంలో భారతదేశ పురుషులకు తెల్లటి మహిళల మీద వున్న ఆసక్తి గురించి చెబుతూ సుదీర్ఘ సుత్తి కొట్టాడు. ఆ తర్వాత ఓ దీర్ఘ శ్వాస తీసుకుని, మొత్తం భారతదేశంలో దక్షిణ భారతదేశంలోని మహిళలు నల్లగా వున్నప్పటికీ, చాలా అందంగా వుంటారని, డాన్స్ కూడా బాగా చేస్తారని, వారు డాన్స్ చేస్తుంటే అలా చూడాలనిపిస్తుందని కళ్ళనిండా తన్మయత్వం కనిపిస్తూ వుండగా చెప్పాడు. దాంతో సభ మొత్తం గగ్గోలు పెట్టేసింది. సభలోని మహిళా ఎంపీలందరూ శరద్ యాదవ్ మీద గయ్యిమని విరుచుకుపడ్డారు. ఏమయ్యా పెద్దమనిషీ, నువ్వు బాధ్యతాయుతమైన పదవిలో వున్న ఎంపీవా? లేక పనీపాటా లేని పోకిరీవా అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. దాంతో శరద్ యాదవ్ ఎరక్కపోయి నోరుజారి ఇరుక్కుపోయానన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇక్కడ నడుస్తున్న టాపిక్కేంటి.. నోటికొచ్చినట్టు నీ వాగుడేంటి అని సభలోని మహిళలు ఆయన్ని కడిగిపారేశారు. శరద్‌ యాదవ్‌ కామెంట్లు దక్షిణాది మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆందోళనకు దిగారు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని.... దేశంలోని మహిళలందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌, సీపీఎం, బీజేపీ కూడా శరద్‌యాదవ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టాయి. అయితే శరద్ యాదవ్ మాత్రం సారీ చెప్పనుగాక చెప్పనంటూ మూతి బిగించుకుని కూర్చున్నాడు. దాంతో నిరసనలు మరింత పెరిగాయి. చివరికి శరద్ యాదవ్ తరఫున జేడీయూ ఎంపీ కేసీ త్యాగి క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది. అయ్యగారికి కట్టుడు పళ్ళు వచ్చినా బుద్ధి మాత్రం మారలేదు. ఏం చేస్తాం... కలికాలం..

By
en-us Political News

  
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.