కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మూడు రాజధానులా? ఇదెలా సాధ్యం? ఇది మూర్ఖపు నిర్ణయం అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. మహారాష్ట్రలో రెండు శాసన రాజధానులు ఉన్నాయి.. వాటినే మేము వృధా అనుకుంటున్నాం.. అలాంటిది మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ఎలా సమర్ధించుకుంటారు? అని పవార్ ప్రశ్నించారు. మూడు రాజధానులపై పార్లమెంట్లో చర్చకు వస్తే అమరావతికే మద్దతు పలుకుతామని.. తనను కలిసిన అమరావతి రైతులకు హామీ ఇచ్చారు శరద్ పవార్.
రాజధాని రైతులు ఢిల్లీలో తమ ఆకాంక్షను అందరికీ తెలియజేస్తున్నారు. మూడు రాజధానులంటూ సీఎం జగన్ ఆడుతున్న మూడు ముక్కలాట గురించి హస్తినలో అన్ని పార్టీల నేతలకు వివరిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పుల రాజుతో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు.
ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులతో అమరావతి రైతులు సమావేశమయ్యారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, బిల్డ్ అమరావతికి సహకరించాలని అభ్యర్ధించారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, వైసీపీ ఎంపీ రఘురామరాజు తదితరులను జేఏసీ నేతలు కలుసుకున్నారు.
దాదాపు 120 మంది అమరావతి జేఏసీ ప్రతినిధులు ఢిల్లీ వెళ్లారు. బృందాలుగా విడిపోయి పార్టీల నేతలు, మంత్రులను కలుస్తున్నారు. అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అమరావతి అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రాలు ఇస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sharad-pawar-support-to-amaravati-25-134012.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.