మోడీకి పవార్ సవాల్.. మారుతున్న ఈక్వేషన్స్..

Publish Date:Jan 12, 2022

Advertisement

దేశ రాజకీయాలలో  శరద్ పవార్ స్థానం ప్రత్యేకం.  ఆయనకు అన్ని పార్టీల  నాయకులతోనూ  దగ్గర సంబంధా లున్నాయి.  ప్రధా ని నరేంద్ర మోడీ సైతం పవార్ 'ను సీనియర్ నాయకుడిగా గౌరవిస్తారు. గడచిన ఏడేళ్లలో ప్రధానితో ఎక్కువసార్లు భేటీ అయినా ప్రతిపక్ష నాయకుడు  ఎవరైనా ఉన్నారంటే అది పవారే కావచ్చును. అనేక కెలక సమస్యల విషయంలో  పవార్ సలహారాలు తీసుకుంటానని, మోడీనే ఆయనకు కితాబు నిచ్చారు.. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీ , ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు  పవార్' ను గౌరవిస్తారు. అదే సమయంలో పవార్, రాజకీయ చతురత సామాన్య మైనది కాదు. తిమ్మిని బమ్మిని చేయగల సమర్ధుడు. అయితే, అందుకే పవార్ ఎంత మంచి మిత్రుడో అంత  గొప్ప శతృవు  కూడా అంటారు. అయినా అయన ప్రధాన్యతను ఎవరు కాదనలేరు.   మహా రాష్ట్రలో, మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఇంకా మనుగడ సాగిస్తోందంటే , అందుకు పవాఁ ర్ రాజకీయ చతురతే  కారణం.  అందుకే కావచ్చు,  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కేంద్రంలో బీజేపీకి ప్రత్యాన్మాయం ఏర్పాటు ప్రయత్నాలను పవార్ తోనే  ప్రారంభించారు.  

ఆప్రయత్నాల సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు పవార్  మరోసారి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంగా ఉత్తర ప్రదేశ్' లో అధికార బీజేపీ సంక్షోభంలో పడిన వెంటనే  పవార్ తెరమీదకు వచ్చారు. సంచలన ప్రకటన చేశారు. మంత్రి  స్వామి ప్రసాద మౌర్య  ఆయన తో పాటుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో పవర్  బీజేపీ నుంచి మొత్త్తం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని, యూపీలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి  అఖిలేష్ యాదవ్ కంటే గట్టిగా చెప్పారు. అలాగే, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఎస్పీతో కలిసి పోటీ చేయనున్నట్లు  శరద్ పవార్ ప్రకటించారు. అలాగే, ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సహా మరి కొన్ని చిన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగనున్నట్లు ఆయన తెలిపారు.  ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీకి అతిపెద్ద సవాల్‌గా మారిన ఎన్సీపీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో పాటు ఎస్పీతో జతకడతామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
  
అలాగే మరో వంక గోవా లోనూ పావులు కదిపారు.  గోవా  శాసన సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్, టీఎంసీలతో చర్చిస్తున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ చెప్పారు. తమకు కావలసిన స్థానాల జాబితాను ఆ పార్టీలకు అందజేశామని చెప్పారు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. గోవాలో మార్పు అవసరమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాలన్నారు. కలిసికట్టుగా పోటీ చేయాలనే అంశంపై ఎన్‌సీపీ, కాంగ్రెస్, టీఎంసీ మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ తాజా పరిణామాలను గమనిస్తున్న రాజకీయా పరిశీలకులు బీజేపీ, కాంగ్రెస్లోయేతర ప్రత్యాన్మాయ కూటమి ఏర్పాటు జరిగితే, నాయకత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు పవార్  వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు ` భావిస్తున్నారు  ,

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
పిల్లల కేరింతలు.. ఆటపాటలు.. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
కుటుంబాలను పోషించేందుకు రోజూ పనికి వెళ్లిన ఆ ముగ్గురు కార్మికులకు అదే పని చివరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.