అసలే కాంగ్రెస్ ఆపై మంత్రిపదవులకు ఆశావహులు చాలా మందే ఉంటారు. ఆ మాటకొస్తే అక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం కూడా పోటీ పెద్ద ఎత్తునే ఉంటుంది. అలాంటిది మంత్రి పదవిపై మాత్రం కాంపిటిషన్ ఉండదా? మొదటి లొల్లి మైనార్టీ నాయకుల నుంచి మొదలైందట. అజారుద్దీనే మైనార్టీ నేత అయితే మరి మేమంతా ఎవరు? అని నిలదీస్తున్నారు ఫిరోజ్ ఖాన్, సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ.
వీరిద్దరూ ఫక్తు రాజకీయ నాయకులు. అజారుద్దీన్ లా స్పోర్ట్స్ కోటాలో పదవి కొట్టేసిన బాపతు కాదు. దీంతో మాకెందుకివ్వలేదు మంత్రి పదవి? అన్నది వీరి ప్రశ్న. అజారుద్దీన్ కన్నా మాకేం తక్కువ. అజార్ కన్నా తెలుగు రాదు. అదే మాకు అలాక్కాదు కదా.. తెలుగులోనూ మాట్లాడి కవర్ చేస్తాం.. అంటారు వీరు.
అజారుద్దీన్ అంటే గతంలో జూబ్లీహిల్స్ రేసు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి.. ఆయన్ని మంత్రిని చేస్తే జూబ్లీహిల్స్ లోని మైనార్టీ ఓటు బ్యాంకును విశేషంగా ఆకట్టుకోవచ్చన్నది అధిష్టానం ఆలోచన. అయితే నేను ఇక్కడి నుంచి పోటీ చేయాల్సింది. నేను త్యాగం చేయడం వల్లే నవీన్‌కి వచ్చిందా టికెట్ కాబట్టి నాకు కదా పదవి ఇవ్వాల్సిందని అంటారు అంజన్ కుమార్ యాదవ్. పదేళ్లుగా బీఆర్ఎస్ తో కొట్లాడిన నాకు మంత్రి పదవి ఏదీ? అంటూ నిలదీస్తారు జీవన్ రెడ్డి. ఇలా మంత్రి పదవులపై బీభత్సమైన గొడవలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో.
అదృష్టమో దురదృష్టమో.. ఇక్కడ గోపీనాథ్ మరణించడం. ఆ టికెట్ అజారుద్దీన్ ఆశించడం. అటు పిమ్మట దానికి నవీన్ యాదవ్ పోటీ రావడం. అజారుద్దీన్ని ఎలాగైనా సరే బుజ్జగించాల్సిందే అన్న ప్రశ్న తలెత్తినపపుడు మిగిలి ఉంచిన మూడు మంత్రి పదవుల్లో ఒకటి ఆయనకు మైనార్టీ కోటా కింద ఇవ్వడం జరిగింది. అప్పటికీ జగన్మోహనరావు స్తానంలో హెచ్. సీ. ఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్ని పంపాలనుకున్నారు. కానీ, అందుకు ఆయన ససేమిరా అనడంతో.. ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధ పడింది కాంగ్రెస్ అధిష్టానం.
అలాగని ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోలేదు. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంపైనా గొడవలు జరుగుతున్నాయ్. జగ్గారెడ్డి, మధు యాష్కి వంటి సీనియర్లు ఈ విషయంలో గుర్రుగా ఉన్నారట. తమను అడక్కుండా, బుజ్జగించకుండా ఇలా ఎలా చేస్తారని వారు అంటున్నారట. కొందరైతే వీరెన్ని చేసినా జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపు అంతంత మాత్రమే అని ఓపెన్ కామెంట్లు చేస్తున్నారట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shabbir-ali-39-208895.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.