గోరంట్ల మాధవ్ దారే దిక్కా.. పలువురు పోలీసు అధికారుల అంతర్మథనం?!

Publish Date:Feb 27, 2023

Advertisement

తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సమీపంలో దుకాణాల తొలగింపు నేపథ్యంలో అటు అదికార వైసీపీ శ్రేణులకు.. ఇటు విపక్ష తెలుగుదేశం నేతల మధ్య చోటు వివాదం జరిగింది. ఆ సందర్భంగా స్థానిక సీఐ మధు.. జోక్యం చేసుకోవడమే కాకుండా  వైసీపీ నేతల భుజాలపైకి ఎక్కి.. మరీ మీసాలు మెలేయడం.. స్థానిక మహిళా కౌన్సిలర్‌పై బూతులతో విరుచుకపడడం.. రాయలసీమలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. 

గతంలో ఇదే జిల్లా.. ఇదే కదిరి పట్టణం సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్.. జిల్లా పోలీస్ అధికారుల సంఘం నాయకుడిగా ఉన్నారని.. అయితే ఆ సమయంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. పోలీసులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సదరు సీఐ గోరంట్ల... ప్రెస్ మిట్ పెట్టి మరీ మీసం మేలేసిన సంగతిని ఈ సందర్భంగా సీమ వాసులు గుర్తు చేసుకొంటున్నారు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. జగన్ పార్టీలో చేరడం.. ఆ వెంటనే ఆయనకు హిందూపురం ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆయన గెలిచి.. లోక్‌సభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత సదరు ఎంపీగారి న్యూడ్ వీడియో   అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేయడం.. దీనిపై ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం.. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్రంలోని పెద్దలకే కాదు... జాతీయ మహిళా కమిషన్ చైర్మన్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై విచారిణ జరిపి... నివేదిక అందజేయాలంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ జిల్లా ఉన్నతాధికారులుకు లేఖ సైతం రాశారు కూడా అయితే ఆ తర్వాత ఈ వ్యవహారం ఏమైందో ఎవరికీ తెలియలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో గోరంట్ల మాధవ్ మాదిరిగానే..  తాజాగా సీఐ మధు వ్యవహర శైలి ఉండడం పట్ల స్థానిక ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు  సీఐ మధు కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అంటు సీమ వాసులు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇంకోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో పోలీస్ శాఖ.. అధికార పార్టీకి ఫేవర్‌గా పని చేస్తోందంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం... గత మూడున్నరేళ్లుగా   ఆరోపింస్తోంది. అంతేకాదు.. గతంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై అధికార పార్టీ శ్రేణులు దాడి చేసినా.. ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపైన ఆ పార్టీ శ్రేణులే దాడులకు దిగి.... వాహనాల విధ్వంసం చేసినా.. పోలీసులు   చోద్యం చూశారు.... చూస్తున్నాయి అని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో ఖాకీవనంలోని పలువురు ఉన్నధికారుల్లో ఓ విధమైన భయం ఆవహించిందని తెలుస్తోంది. ఓ వేళ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే.. తమ పరిస్థితి ఏమిటనే ఓ సందేహం   వారిలో ప్రారంభమైందని.. అదే జరిగితే.. ఇటీవల.. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్ పోలీసుల వైఖరికి నిరసనగా చెప్పినట్లు చేస్తే... మన పరిస్థితి ఏమిటనే ఓ చర్చ   పోలీస్ ఉన్నతాధికార వర్గంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.  

ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలకు రాజీనామా చేసి.. పోలీస్ క్యాప్.. చేతిలోని లాటీ పక్కన పెట్టేసి... ఫ్యాన్ పార్టీలో చేరితే.. అయితే ఎంపీ లేకుంటే.. ఎమ్మెల్యే .. అదీ లేకుంటే.. ఆ పార్టీకి పని చేసుకొంటూ.. ఉంటే.. భవిష్యత్తులో తమకు ఎంతో కొంత రక్షణ ఉంటుందనే ఆలోచనలో కొందరు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అదీకాక సీఐడీ మాజీ డీజీ పి.వి. సునీల్ కుమార్‌ ప్రస్తుతం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో.. భవిష్యత్తులో తమకు అలాంటి పరిస్థితులు ఎదురైతే.. అనే ఆలోచనలో పలువురు పోలీసు ఉన్నతాధికారు ఉన్నారన్న  చర్చ ఏపీ పోలీస్ శాఖలో హల్‌చల్ చేస్తున్నట్లు సమాచారం.

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.