రాజస్థాన్ లో బుధవారం (జులై 1) తెల్లవారు జామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ, ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెడుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
బస్సు అతి వేగంగా వెడుతుండటంతో.. ప్రమాద తీవ్రతకు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హరిద్వార్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెడుతున్న ఈ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 39 మంది ప్రయాణీకులు ఉన్నారని చెబుతున్నారు.
ప్రమాద సమయంలో ప్రయాణీకులంతా గాఢ నిద్రలో ఉండటంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/seven-burnt-alive-in-accident-36-224707.html
తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా పరుగులు తీయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగారు.
రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మావిగన్‌కు కట్టుబడి ఉన్నాం..3 అటకెక్కినట్లేనా?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు మరింత జటిలంగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఝార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక అసాధారణ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పేదరిక నిర్మూలనకు అత్యంత కీలకమైన సాధనంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
రౌడీషీటర్ కేసు చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందనీ, ఈ కేసును బలవంతంగా ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాని అన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి, తోటి విభాగాల నుంచే తనకు ప్రాణభయం ఉందంటూ ఆక్ష్న న్యాయస్థానంలో మొరపెట్టుకోవడం సంచలనం రేపింది.
యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను, ముఖ్య నాయకులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన బాహాటంగా తన నిరసన వ్యక్తం చేశారు.
లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు.
నెట్వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30, అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.