కాంగ్రెస్ అధ్యక్ష రేసులో కొత్త పేరు శశిథరూర్

Publish Date:Aug 30, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో ఇంత వరకూ సుముఖత చూపలేదు సరికదా.. తమ కుటుంబానికి చెందని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలన్న తన పాత మాటకే కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. అయితే సోనియా గాంధీ మాత్రం తమ కుటుంబానికి చెందిన వ్యక్తే పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. తన బిడ్డలిద్దరిలో ఆమె రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నారు. రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతలోనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ ను ఖరారు చేసేశారు. మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలైతే రాహులే తమ నాయకుడనీ, ఆయనకు ప్రత్యామ్నాయం లేదనీ అంటున్నారు.

ఇక రాహుల్ అంగీకరించకపోతే.. అశోక్ గెహ్లాట్ కు పగ్గాలు అప్పగించాలని సోనియా భావించినా.. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు పేర్లు వినిపించాయి. తాజాగా ఇప్పటి వరకూ రేస్ లో లేని శశిథరూర్ పేరు తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఆయన పోటీ పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.  ఎందుకంటే పార్టీలో సంస్థాగత సంస్కరణలు అనివార్యం అంటూ రెండేళ్ల కిందట పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన జీ23 నేతలలో ఎంపీ శశిథరూర్ కూడా ఒకరు. తాజాగా ఒక మళయాళ పత్రికకు రాసిన వ్యాసంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఒక్క అధ్యక్ష స్థానానికే కాకుండా సీడబ్ల్యుసీలో ఖాళీగా ఉన్న స్థానాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం చాలా అవసరమని ఆ ఎన్నికే పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావడానికి నాంది అవుతుందని శశిథరూర్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 22న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది.  ఎన్నిక అక్టోబర్ 17న జరుగుతుంది. అదే నెల 19న ఫలితం వెలువడుతుంది. కాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటి వరకూ రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.

తొలి సారి 1997లో జరిగాయి. ఆ ఎన్నికలో శరద్ పవార్, రాజేష్ పైలట్, సీతారాం కేసరిలో పోటీ చేశారు. సీతారాం కేసరి విజయం సాధించారు. ఆ తరువాత 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలో జితేంద్రప్రసాదర్ సోనియాగాంధీపై పోటీ చేశారు. ఆ ఎన్నికలో సోనియా గాంధీ ఘనమైన మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికలో సోనియా గాంధీకి 7448 ఓట్లు వచ్చాయి. జితేంద్రప్రసాద్ కు కేవలం 94 ఓట్లు వచ్చాయి.

అయితే ఈ సారి మాత్రం పోటీ జరిగితే గతానికి భిన్నమైన పరిస్థితి ఉంటుందన్నది మాత్రం నిర్వివాదాంశం. ఈ సారి ఎన్నికలలో తాను రంగంలో ఉంటానని శశిథరూర్ తన వ్యాసం ద్వారా చెప్పకనే చెప్పారు.  గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికే పార్టీ అధ్యక్ష పదవి అన్నది అనివార్యమైతే పోటీలో ఉండే వారి సంఖ్య బారీగానే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.