ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం..నిత్య పెళ్లికూతురు అరెస్ట్

Publish Date:Jun 27, 2026

Advertisement

 

పెళ్లి పేరుతో అమాయక యువకులను వలలో వేసుకుని నగదు, బంగారం దోచుకుని పరారవుతున్న సీరియల్ పెళ్లికూతురు కథ అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురిని వివాహం చేసుకుని మోసం చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో నిందితురాలిని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన వజ్రపు పాండు కుమార్తె మణిగా గుర్తించారు. విజయవాడకు చెందిన మధ్యవర్తులు అశోక్, శశికళ, రామకృష్ణ సహకారంతో సుమప్రియ పేరుతో యువకులకు పరిచయమై వివాహాలు కుదుర్చుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

పెళ్లి సమయంలో నమ్మకం కలిగించేలా ప్రవర్తిస్తూ, ఎదురుకట్నం లేదా ఇతర హామీలతో వివాహం చేసుకునేది. అనంతరం కొద్ది రోజులు భర్త ఇంట్లో ఉండి, అవకాశం చూసుకుని నగదు, బంగారం తీసుకుని ఎవరికి చెప్పకుండా పరారవడం ఆమె నేరపద్ధతిగా గుర్తించారు.

పెద్దవడుగూరు మండలం కాశేపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. 2025లో సుధీర్ రెడ్డి రూ.3.8 లక్షల ఎదురుకట్నం ఇచ్చి సుమప్రియను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మూడు రోజుల పాటు ఇంట్లో ఉన్న నిందితురాలు, ఆరోగ్యం బాగోలేదని చెబుతూ పుట్టింటికి వెళ్లాలని కోరింది. ఆమెను రైలులో పంపించగా, నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద దిగిపోయి అదృశ్యమైంది.

ఆమె కోసం సుధీర్ రెడ్డి విస్తృతంగా గాలించినా ఆచూకీ లభించలేదు. వివాహం కుదిర్చిన మధ్యవర్తులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో అనుమానం వ్యక్తమైంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది.

విచారణలో మణి ఇప్పటికే మరో నలుగురిని కూడా ఇదే తరహాలో వివాహం చేసుకుని మోసం చేసినట్లు బయటపడింది. అంతేకాకుండా ఆమెకు ఇప్పటికే కుమారుడు, కుమార్తె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక భర్తకు మరో పెళ్లి విషయం తెలియకుండా వరుసగా ఐదుగురిని వివాహం చేసుకుని మోసాలకు పాల్పడినట్లు తేలింది.

ఇటీవల కర్ణాటకలోని మల్లెకుప్ప గ్రామానికి చెందిన వ్యక్తిని కూడా వివాహం చేసుకున్న మణి, పెళ్లైన ఆరు రోజులకే మదనపల్లె వైపు వస్తున్నట్లు సమాచారం అందడంతో పెద్దవడుగూరు ఎస్ఐ ఆంజనేయులు నేతృత్వంలోని పోలీసు బృందం చాకచక్యంగా వ్యవహరించింది. మదనపల్లె మండలం చీకలబైలు సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది.

నిందితురాలితో పాటు ఈ మోసాలకు సహకరించిన మధ్యవర్తుల పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివాహ సంబంధాలు కుదుర్చుకునే ముందు పూర్తిస్థాయి వివరాలు సేకరించి, ధ్రువీకరణ అనంతరమే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాధికార యంత్రాంగంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మి
కుల, మతాలకు అతీతంగా జరిపే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఎలా మొదలైంది..?
పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్, ప్రపంచ క్రికెట్ లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలోని గడిపెద్దపూర్ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
పీకలదాకా మద్యం సేవించారు... నేరుగా జ్యువెలరీ షోరూమ్‌లోకి దూసుకెళ్లారు
యాపిల్ మాక్ ఓఎస్ యూజర్ల కోసం నార్టన్ వీపీఎన్ స్ప్లిట్ టన్నెలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరుస్తూ, నిర్దిష్ట యాప్‌లను వీపీఎన్ పరిధి నుండి ఎలా మినహాయించవచ్చో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో ఉరుగ్వేపై 1 0 తేడాతో స్పెయిన్ ఘన విజయం. అలెక్స్ బేనా సంచలన గోల్‌తో స్పెయిన్ నాకౌట్ దశకు చేరుకోగా, రెండు సార్లు ఛాంపియన్ ఉరుగ్వే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
చిన్న పిల్లల సురక్షిత టీవీ వీక్షణ కోసం హైసెన్స్ సరికొత్త సేఫ్ స్ట్రీమింగ్ మ్యాజిక్ రిమోట్‌ను పరిచయం చేసింది. 50,000 పైగా చైల్డ్-సేఫ్ ఎపిసోడ్‌లతో కూడిన ఈ సరికొత్త టెక్నాలజీ వివరాలు ఇవే!
మేడ్చల్–మల్కాజగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేటలో శనివారం హైడ్రా మరోసారి భారీ ఆపరేషన్ చేపట్టి కబ్జాదారులకు షాక్ ఇచ్చింది.
ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం కావడంపై రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ఎందుకు సమర్థించారో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.