టీసీఎస్ కేసులో సంచలన మలుపు.. గర్భవతినంటూ నిదా ఖాన్ ముందస్తు బెయిల్‌ పిటిషన్!

Publish Date:Apr 16, 2026

Advertisement

 కార్పొరేట్ రంగంలో పెను సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా..  సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంత వరకూ పరారీలో ఉన్న  హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ నాసిక్ జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.   తాను గర్భవతినని, మానవతా దృక్పథంతో తనకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. 

నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో జూనియర్ ఉద్యోగినులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి యత్నాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిదా ఖాన్ పాత్ర అత్యంత కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. బాధితులు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిదా ఖాన్  వారిని బెదిరించి, నిందితులైన సీనియర్ అధికారులకు సహకరించారని ఆరోపణలున్నాయి.   ఆమె కోసం పోలీసులు ముంబై సహా ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తుండగా,   ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సంచలనం సృష్టించింది.

తన యాంటిసిపేటరీ బెయిల్   నిదా ఖాన్ గర్భవతినని పేర్కొన్నారు.  సామాన్యంగా గర్భవతిగా ఉన్న మహిళల విషయంలో   న్యాయస్థానాలు కొంత సానుభూతి చూపే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆమె  ప్రెగ్నెన్సీ కార్డును ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే..  కేసు తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం ఆమె విన్నపాన్ని ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ కేసులో ఇప్పటివరకు సిట్ అధికారులు ఏడుగురిని  అరెస్ట్ చేశారు. మొత్తం 9 ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశారు. అలాగే టీసీఎస్ యాజమాన్యం ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసింది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ నేతృత్వంలో అంతర్గత విచారణ కూడా   సాగుతోంది. హిందూ దేవతలను కించపరచడం, మహిళలను బురఖా ధరించమని ఒత్తిడి చేయడం వంటి తీవ్రమైన అంశాలు ఉండటంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

నిదా ఖాన్ దాఖలు చేసిన ఈ బెయిల్ పిటిషన్‌పై నాసిక్ కోర్టు   శుక్రవారం( ఏప్రీన్ 17) విచారణ జరపనుంది.    కోర్టు ఆమెకు ఊరటనిస్తుందా లేక పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశిస్తుందా అనేది  చూడాల్సి ఉంది. మరోవైపు పోలీసులు మాత్రం ఆమెను కస్టడీలోకి తీసుకుంటేనే ఈ కేసులోని మరిన్ని లోతైన విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.  

By
en-us Political News

  
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు.
డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే. తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.
లైంగిక వేధింపులే కాకుండా, బలవంతపు మత మార్పిడిలు, గూమింగ్, అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్ లాంటి తీవ్రమైన అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని రాహుల్ గాంధీ అభివర్ణించారు
చైనా ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితులు సాధారణ మందగమనం కంటే ఎక్కువగా, ఒక లోతైన వ్యవస్థాత్మక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు ఏడో రోజుకి చేరుకున్నాయి.
దేశ అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభలో శుక్రవారం అనూహ్యమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కాదు ్ర నాషిక్ పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి మరీ దర్యాప్తు చేస్తున్న కేసులు. టీసీఎస్ లో ఉద్యోగుల్లా చేరిన మహిళా పోలీసులు. సుమారు ఏడెనిమిది మంది మహిళా పోలీసులు టీసీఎస్ నాసిక్ యూటిన్ లో ఉద్యోగులుగా, హౌస్ కీపింగ్ సిబ్బందిగా చేరారు. దాదాపు రెండు మూరు వారాలు.. కొన్ని నివేదిక ప్రకారమైతే 40 రోజులు అక్కడ పని చేసి వర్క్ ప్లేస్ బిహేవియర్ ను నేరుగా గమనించారు. పరిశీలించారు. గూమింగ్, లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి అంశాలపై ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్ సేకరించారు. ఇది సాధారణ ఫిర్యాదు ఆధారంగా జరిగిన విచారణ కాదు. పూర్తిగా ప్రణాళికా బద్ధంగా జరిగిన అండర్ కవర్ ఆపరేషన్.
అమెరికాపై నాన్‌స్టాప్‌ సెటైర్లు వేస్తూ, ఏఐ, లెగో వీడియోలతో ఇరాన్ ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.